Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాశ్మీర్ సంగతి సరే.. కరాచీ సంగతి చూడండి : గంభీర్ ఎద్దేవా (వీడియో)

కాశ్మీర్ సంగతి సరే.. కరాచీ సంగతి చూడండి : గంభీర్ ఎద్దేవా (వీడియో)
, బుధవారం, 2 అక్టోబరు 2019 (11:25 IST)
శ్రీలంక క్రికెట్ జట్టు పాకిస్థాన్ దేశంలో పర్యటిస్తోంది. ఆ జట్టుకు కనీవినీ ఎరుగని భద్రతను పాకిస్థాన్ ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ భద్రతపై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పందించారు. శ్రీలంక జట్టుకు కల్పిస్తున్న భద్రతకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన గంభీర్.. కాశ్మీర్ గురించి కాకుండా తొలుత కరాచీ సంగతి చూడాలని ఎద్దేవా చేస్తూ కామెంట్ రాశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. 
 
గత 2009లో శ్రీలంక క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించింది. అపుడు లంక క్రికెటర్లు ప్రయాణించే బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు క్రికెటర్లు గాయపడగా, మరికొందరు తప్పించుకున్నారు. ఆ దేశంలో క్రికెట్ ఆడేందుకు ఏ దేశమూ ముందుకు రావడం లేదు.
 
ఈ నేపథ్యంలో మళ్లీ శ్రీలంక క్రికెట్ జట్టే పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, రెండో వన్డేలో పాక్ విజయం సాధించింది. బుధవారం మూడో వన్డే జరగనుంది. 
 
అయితే, ఉగ్ర భయం నేపథ్యంలో పాక్‌లో పర్యటిస్తున్న శ్రీలంక జట్టుకు అధ్యక్షుడి స్థాయిలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆటగాళ్లు బసచేసే హోటల్‌ బయట,  స్టేడియం చుట్టూ ఏకంగా 2 వేల మంది పోలీసులతో భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక వారు ప్రయాణించే మార్గంలో 42 వాహనాలతో భారీ కాన్వాయ్ ఏర్పాటు చేశారు. ఈ వీడియోను గంభీర్ పోస్టు చేయగా, అది వైరల్ అయింది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాంబవంతుల రికార్డులను చెదరగొట్టిన క్రికెటర్ ఎవరు? (Video)