Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

Advertiesment
Pakistani MP Shahid Ahmad Khattak

ఠాగూర్

, శుక్రవారం, 9 మే 2025 (20:09 IST)
భారత్‌ - పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. శత్రుదేశం పాకిస్థాన్‌పై స్వయానా అదే దేశానికి ఎంపీ షాహిద్ అహ్మద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మా దేశం ప్రధానమంత్రిని పిరికోడుగా పేర్కొంటూ, ఆయన యుద్ధక్షేత్రాన్ని వదిలిపారిపోయాడంటూ విమర్శలు గుప్పించారు. 
 
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌‌లో ఉన్న ఉగ్రస్థావరాలపై భారత వైమానికి దళం దాడిచేయడాన్ని జీర్ణించుకోలేని పాకిస్థాన్ ప్రతిదాడులకు దిగింది. దీంతో భారత్ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించింది. పాకిస్థాన్‌‍లోని కరాచీ, లాహోర్ వంటి కీలక నగరాలపై కూడా దాడులు చేస్తోంది. దీంతో పాకిస్థాన్ పాలకులు బెంబేలెత్తిపోతున్నారు. 
 
ఈ పరిణామాలతో దాయాది దేశం ఉక్కిరిబిక్కిరి అవుంది. భారత్‌‍పై పాక్ చేస్తున్న దాడులు ఏమాత్రం ఫలితం చూపించలేకపోయాయి. పాకిస్థాన్ గగనతల వ్యవస్థలను సైతం భారత్ ధ్వంసం చేసింది. ఈ పరిణామాలతో పలువురు పాక్ ప్రజలు, రాజకీయ నేతలు అక్కడి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 
 
తాజాగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు తెహ్రీకి ఏ ఇన్సాఫ్ పార్టీకి చెందిన ఎంపీ షాహిద్ అహ్మద్ .. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పాక్ పార్లమెంట్ వేదికగా ప్రసంగిస్తూ తమ ప్రధాని పిరికివాడని, భారత ప్రధాని మోడీ పేరు సైతం పలకడానికి ఆయన భపడుతున్నారన్నారు. టిప్పు సుల్తాన్ చెప్పిన కోట్‌ను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 
 
సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే అవి యుద్ధంలో పోరాడలేక ఓడిపోతాయన్నారు. అదేవిధంగా సరిహద్దుల్లో ఉన్న తమ సైనికులు ధైర్యంగా భారత్‌తో పోరాడలనుకున్నా దేశ ప్రధానికే ధైర్యం లేనపుడు వాళ్లు ఎలా ముందడుగు వేయగలరని ప్రశ్నించారు. భారత్ దాడి చేసినప్పటి నుంచి ఆ దేశానికి వ్యతిరేకంగా పాక్ ప్రధాని ఒక్క ప్రకటన కూడా చేయలని ఆయన గుర్తు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత