Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాక్ అబ్బాయి వైద్యం కోసం సుష్మా భరోసా... భారత్‌కు ప్రణమిల్లిన పాక్ తండ్రి

రెండు దేశాల మధ్య దాయాది మాత్సర్యం కూడా మానవత్వం విరాజిల్లే అరుదైన క్షణాల్లో కాస్సేపు మాయమైపోవడం అంటే ఇదేనేమో. కేంద్ర ప్రభుత్వంలో ఇంతవరకు ఒక వివాదం కూడా చోటు చేసుకోకుండా మంచి పని తీరు కనిపిస్తున్న విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ విదేశాంగ మంత్

పాక్ అబ్బాయి వైద్యం కోసం సుష్మా భరోసా... భారత్‌కు ప్రణమిల్లిన పాక్ తండ్రి
హైదరాబాద్ , శుక్రవారం, 2 జూన్ 2017 (02:45 IST)
రెండు దేశాల మధ్య దాయాది మాత్సర్యం కూడా మానవత్వం విరాజిల్లే అరుదైన క్షణాల్లో కాస్సేపు మాయమైపోవడం అంటే ఇదేనేమో. కేంద్ర ప్రభుత్వంలో ఇంతవరకు ఒక వివాదం కూడా చోటు చేసుకోకుండా మంచి పని తీరు కనిపిస్తున్న విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కంటే వేగంగా స్పందించి భారత్‌లో వైద్య చికిత్స కోసం ఒక పాకిస్తాన్ కన్నతండ్రికి సహాయం అందించిన ఘటన ఆ పాకిస్తానీ తండ్రి హృదయాన్ని కరిగించేసింది. ఇరు దేశాల మధ్య చాలా వివాదాలున్నప్పటికీ భారత మంత్రి సుష్మా తన కుమారుడి అనారోగ్యంపై మానవత్వం చాటడాన్ని కొనియాడుతూ ఆ తండ్రి గురువారం ట్వీట్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
 
విషయం ఏమిటంటే.. పాకిస్థాన్‌కు చెందిన కెన్ మే 24న అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడి రోహన్ ఫోటోతో ఓ ట్వీట్ చేశారు. వైద్యం కోసం తన కుమారుడు ఎందుకు ఇబ్బంది పడాలి? పాకిస్తాన్ విదేశీమంత్రి సర్ సర్తాజ్ అజీజ్ లేదా భారత విదేశీ మంత్రి మేడమ్ సుష్మా సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు. 
 
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మే 31 బుధవారం దీనిపై స్పందించారు. వైద్యం కోసం మీ చిన్నారి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. పాకిస్థాన్‌లోని ఇండియన్ హై కమిషన్‌ను సంప్రదిస్తే మెడికల్ వీసా మంజూరు చేస్తామని సుష్మా భరోసా ఇచ్చారు. 
 
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందనకు ఆ పాకిస్థానీ తండ్రి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇరు దేశాల మధ్య చాలా వివాదాలున్నప్పటికీ మానవత్వం చాటడాన్ని కొనియాడుతూ గురువారం ట్వీట్ చేశారు.  అంతటితో ఆగక ఇండియా గ్రేట్, జై హింద్ అంటూ తెగ పొగిడేశారు. సుష్మా స్వరాజ్‌తో పాటు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరెస్ట్ అధిరోహకులకు రూ.10 లక్షల నజరానా... ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం: సీఎం బాబు