Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైలు హైజాక్ ఆపరేషన్‌పై పాక్ ఆర్మీ అబద్దాలు... బీఎల్ఏ ఏం చెంబుతోంది?

Advertiesment
pak train

ఠాగూర్

, శుక్రవారం, 14 మార్చి 2025 (11:59 IST)
రైలు హైజాక్ ఆపరేషన్‌పై పాకిస్థాన్ ఆర్మీ తప్పుడు ప్రచారం చేస్తుందని, బందీలంతా తమ వద్ద ఉన్నారంటూ బలూచిస్థాన్ వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) స్పష్టంచేసింది. పైగా, పాకిస్థాన్ బలగాలతో యుద్ధం కొనసాగుతూనే ఉందని తెలిపింది. పాక్ వైపు భారీ నష్టం జరిగిందని వెల్లడించింది. పాక్ సైన్యం గెలవలేదని, బందీలంతా తమ వద్దే ఉన్నారని పేర్కొంది.
 
క్వెట్టా నుంచి పెషావర్ వెళుతున్న జఫార్ ఎక్స్‌ప్రెస్ రైలును బీఎల్ఏ మిలిటెంట్లు హైజాక్ చేసిన విషయం తెల్సిందే. ఈ ఆపరేషన్‌ విజయవంతంగా ముగిసిందని, మిలిటెంట్లను హతమార్చినట్టు పేర్కొంది. పాక్ తాజా ప్రకటనపై బీఎల్ఏ స్పందించింది.
 
పాక్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడింది. పాక్ ఆర్మీతో ఇంకా పోరు కొనసాగుతూనే ఉందని ప్రకటించింది. తాము ఖైదీల మార్పిడికి ప్రతిపాదించామని, కానీ, చర్చలకు నిరాకరించిన పాకిస్థాన్ తమ సైనికులను గాలికి వదిలేసిందన్నారు. అసలేం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇండిపెండెంట్ జర్నలిస్టులను పంపాలని బీఎల్ఏ ప్రతినిధులు కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Online trading scam: అస్సామీ నటి సుమి బోరాతో పాటు నిందితులపై సీబీఐ కొత్త డాక్యుమెంటరీ