Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు

Advertiesment
Elon Musk

సెల్వి

, శనివారం, 15 ఫిబ్రవరి 2025 (18:45 IST)
Elon Musk
కన్జర్వేటివ్ ఇన్ఫ్లుయెన్సర్, రచయిత్రి ఆష్లే సెయింట్ క్లెయిర్ తన ఐదు నెలల బిడ్డకు బిలియనీర్, ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలెన్ మస్క్ తండ్రి అని ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. "ఐదు నెలల క్రితం, నేను ప్రపంచంలోకి ఒక కొత్త బిడ్డను స్వాగతించాను. నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి" అని రాశారు. "అలియా లాక్టా ఎస్ట్" (ది డై ఈజ్ కాస్ట్) అనే లాటిన్ పదబంధాన్ని జోడించడం ద్వారా ఆమె సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఎక్స్ ద్వారా ప్రకటించారు. 
 
ఇప్పటివరకు తన బిడ్డ గుర్తింపును గోప్యంగా ఉంచిన సెయింట్ క్లెయిర్, తన ఇష్టాలు ఏమైనప్పటికీ మీడియా సంస్థలు దానిని బహిర్గతం చేయాలని యోచిస్తున్నాయని తెలుసుకున్న తర్వాత ఆ సమాచారాన్ని తానే వెలుగులోకి తెచ్చారు. 
 
"మా బిడ్డ గోప్యత, భద్రతను కాపాడటానికి నేను ఇంతకు ముందు దీన్ని వెల్లడించలేదు, కానీ ఇటీవలి రోజుల్లో టాబ్లాయిడ్ మీడియా అలా చేయాలని భావిస్తోంది, దాని వల్ల కలిగే హానితో సంబంధం లేకుండా ఈ విషయాన్ని వెల్లడించాను" అని సెయింట్ క్లెయిర్ రాశారు. తమ బిడ్డ సురక్షితమైన వాతావరణంలో ఎదగడానికి తాను అనుమతిస్తానని సెయింట్ క్లెయిర్ వెల్లడించారు. తన పోస్ట్‌లో, సెయింట్ క్లెయిర్ మీడియా తన బిడ్డ గోప్యతను గౌరవించాలని, దాడి చేసే రిపోర్టింగ్‌కు దూరంగా ఉండాలని కోరుతూ అభ్యర్థించారు.
 
మస్క్ వ్యక్తిగత జీవితంపై ప్రజలకు నిరంతర ఆసక్తి ఉన్న నేపథ్యంలో ఈ వార్త వెలువడటంతో ఈ విషయం వైరల్ అవుతోంది. అనేక వ్యాపార సంస్థలు, టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈవోగా వున్న ఎలెన్ మస్క్ వ్యక్తిగత వివరాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మస్క్ గతంలో ఇతర భాగస్వాములతో పిల్లలకు తండ్రిగా ఉన్నాడు. కానీ ఈ ప్రకటన మస్క్ ప్రతిష్టకు దెబ్బతీస్తుందా అనేది తెలియాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

SBI Home Loan: ఎస్బీఐ గుడ్ న్యూస్.. హోమ్ లోన్స్‌పై వడ్డీరేట్లు తగ్గింపు