Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్ గుట్టురట్టు.. సజీవంగా పట్టుబడిన తీవ్రవాది..

Advertiesment
పాకిస్థాన్ గుట్టురట్టు.. సజీవంగా పట్టుబడిన తీవ్రవాది..
, గురువారం, 16 ఏప్రియల్ 2020 (19:37 IST)
పాకిస్థాన్ గుట్టురట్టు అయ్యింది. ఆప్ఘనిస్థాన్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌ గురించి తెలుసుకుంటే.. పాక్‌ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని తెలుస్తోంది. నాలుగైదు రోజుల క్రితం.. ఆఫ్ఘనిస్థాన్ భద్రతా దళాలకు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది ఒకడు పట్టుబడ్డాడు. ఆ ఉగ్రవాదిని విచారించగా.. పలు షాకింగ్ విషయాలు బయటపడ్డాయని.. ఆఫ్ఘన్ ప్రభుత్వం వెల్లడించింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఈ నెల 13-14వ తేదీల మధ్య రాత్రి సమయంలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన పలువురు టెర్రరిస్టులు.. పాక్‌ -ఆఫ్ఘన్ బార్డర్‌లోని నన్‌గర్హర్ ప్రావిన్స్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన ఆఫ్ఘన్ భద్రతా బలగాలు.. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ప్రయత్నించారు. 
 
ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో.. భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో పది మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఐదు మంది ఆఫ్ఘన్ తాలిబన్‌ ఉగ్రవాదులు కూడా మృతిచెందారు. ఓ నలుగురు ఆఫ్ఘన్‌ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
 
ఈ క్రమంలో ఒక ఉగ్రవాదిని మాత్రం భద్రతా బలగాలు సజీవంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. అంతేకాదు.. మృతిచెందిన ఉగ్రవాదుల వద్ద నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇక పట్టుబ్డడ ఉగ్రవాదిని విచారించగా.. తాను ఆఫ్ఘన్‌కు రావడం ఇదే తొలిసారంటూ.. పలు సంచలన విషయాలు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. తాను పాకిస్థాన్‌లో నాలుగు నెలలపాటు శిక్షణ పొందినట్లు తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్; హెలికాప్టర్ మనీ అంటే ఏంటి? అది ఆర్థికవ్యవస్థకు ప్రమాదకరమా?