Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్-పాక్‌ల మధ్య సైబర్ వార్.. పాక్ హ్యాకర్ల కంటే భారత హ్యాకర్లదే పైచేయి.. దేశమే?

భారత్-పాకిస్థాన్‌ల మధ్య సర్జికల్ స్ట్రైక్ ఉద్రిక్త వాతావరణానికి తెరదీశాయి. సరిహద్దుల్లో ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అలాగే సైబర్ స్పేస్‌లోనూ వార్ జరుగుతోంది. సెప్టెంబర్ 29 సర్జికల్ స్ట్రయిక్ అనంతరం పాకి

Advertiesment
Pakistan's cyber war more about propaganda than data theft
, బుధవారం, 12 అక్టోబరు 2016 (16:00 IST)
భారత్-పాకిస్థాన్‌ల మధ్య సర్జికల్ స్ట్రైక్ ఉద్రిక్త వాతావరణానికి తెరదీశాయి. సరిహద్దుల్లో ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అలాగే సైబర్ స్పేస్‌లోనూ వార్ జరుగుతోంది. సెప్టెంబర్ 29 సర్జికల్ స్ట్రయిక్ అనంతరం పాకిస్తాన్ హ్యాకర్స్.. భారత్ వెబ్‌సైట్లపై పడ్డారు. పాకిస్థాన్ హ్యాకర్స్ దాదాపు ఏడువేల భారత సైట్లను దోచేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. కానీ ఆ పప్పులు ఉడకలేదని.. వాటిపై కంట్రోల్ లేకపోవడంతో.. ఎలాంటి డేటాను సేకరించలేకపోయారని తెలుస్తోంది. 
 
పాక్ హ్యాకర్స్‌కు ప్రతిగా భారత్ హ్యాకర్స్ దాదాపు వంద పాకిస్తాన్ వెబ్ సైట్ల పైన పడ్డారు. వాటిని హ్యాకర్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో పాకిస్థాన్ హ్యాకర్స్ తగ్గని పరిస్థితి ఏర్పడింది. తమ సైట్లను రిలీజ్ చేసేందుకు వారు భారత్ హ్యాకర్లతో మాట్లాడినా, డబ్బులిస్తామన్నా.. దేశమే మిన్న అని ఇండియన్ హ్యాకర్స్ తిప్పికొట్టారు.
 
పాకిస్తాన్ హ్యాకర్స్ సైబర్ దాడిలో తమ సత్తా చూపించాలని భావించారు. కానీ ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం శూన్యం. ఇకపోతే.. పాకిస్థాన్‌లో దాదాపు 3,000 మంది పూర్తి టైమ్ హ్యాకింగ్ కోసం పని చేస్తున్నారు. హానీ ట్రాప్ నుంచి వెబ్ సైట్లను డిఫేస్ చేసేందుకు వారంతా ఓ యూనిట్‌గా ఉన్నారు. అయితే సర్జికల్ స్ట్రయిక్ తర్వాత వారు మరింత సైబర్ దాడికి ప్రయత్నిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో బాలభీముడు - పుట్టగానే ఐదున్నర కిలోల బరువు