Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతిలో బాలభీముడు - పుట్టగానే ఐదున్నర కిలోల బరువు

కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నది సామెత. అయితే పుట్టుకతోనే బాలభీముడిగా పుట్టాడు ఆ బాలుడు. అందరినీ ఆశ్చర్యపరిచే బరువుతో రికార్డు సృష్టిస్తూ భూమిపైకి వచ్చాడు. ఒకవైపు పండంటి బిడ్డ పుట్టాడన్న ఆనందం, మరోవైపు ఇంత బరువు భవిష్యత్తులో ఎంత ప్రమ

Advertiesment
over weight kid
, బుధవారం, 12 అక్టోబరు 2016 (15:05 IST)
కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నది సామెత. అయితే పుట్టుకతోనే బాలభీముడిగా పుట్టాడు ఆ బాలుడు. అందరినీ ఆశ్చర్యపరిచే బరువుతో రికార్డు సృష్టిస్తూ భూమిపైకి వచ్చాడు. ఒకవైపు పండంటి బిడ్డ పుట్టాడన్న ఆనందం, మరోవైపు ఇంత బరువు భవిష్యత్తులో ఎంత ప్రమాదాన్ని తెస్తుందోనన్న ఆందోళన ఆ తల్లిదండ్రులది. ప్రస్తుత వైద్యుల పర్యవేక్షణలో పెరుగుతున్న బాలభీముడిపై   ప్రత్యేక కథనం.
 
ఏ బిడ్డ అయినా పుట్టుకతో ఒకటిన్నర కిలోల నుంచి మూడున్నర కిలోలు ఉంటారు. అంత బరువు ఉంటే సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నట్లు లెక్క. ఇప్పటివరకు నాలుగుకిలోల బరువున్న బాలుడు కూడా పుట్టడం చూశాం. కానీ మొదటిసారి ఈ రికార్డులన్నీ తలదన్నుతూ ఐదున్నర కిలోల బరువుతో ఒక బాలభీముడు జన్మించాడు. కడప జిల్లా కోడూరులోని షాలినికి జన్మించిన ఈ బాలుడు పుట్టుకతోనే అధికబరువుతో రికార్డు సాధించాడు. అయితే ఈ బాలుడి బరువుపై వైద్యులు భిన్నాబిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
ఎందుకు ఇంత ఎక్కువ బరువుతో పుట్టాడన్న దానిపై డాక్టర్లు పరిశీలన చేస్తున్నారు. అప్పుడప్పుడు జన్యువుల కారణంగా అలా పుడతారని కొంతమంది డాక్టర్లు చెబుతుంటే, మరికొంతమంది మాత్రం తల్లిదండ్రులకు మధుమేహం, ఊబకాయం లాంటి వ్యాధులు ఉన్నప్పుడు వారికి పుట్టే బిడ్డలు ఇలా అధిక బరువుతో పుడతారని చెబుతున్నారు. పండంటి బిడ్డ పుట్టారన్న సంతోషంతో ఉన్న తల్లిదండ్రులు ఈ డాక్టర్లు వెలిబుచ్చుతున్న భిన్నాభిప్రాయాలతో కొంత ఆందోళనకు గురవుతున్నారు. 
 
ప్రస్తుతం ఆ బాలుడు తిరుపతిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుల సమక్షంలో చికిత్సను అందిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి ఊపిరి తీసుకోవడానికి బాలుడు ఇబ్బంది పడుతూ ఉండడంతో తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు తల్లిదండ్రులు. బాలుడి బంధువులు మాత్రం తమ బాలుడికి ఎలాంటి ఇబ్బంది లేదని, అప్పుడప్పుడు ఇలా అధిక బరువుతో పుడుతుంటారని, దాని వల్ల భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. అధిక బరువుతో పిల్లలు పుట్టడం వల్ల మొదట్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయని, తరువాత భవిష్యత్తులో బాలుడికి ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సీఎం ఆఫీస్ ప్రత్యేకతలెన్నో... ప్రత్యేక కథనం...