Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జమ్మూ కాశ్మీర్‌లో రక్తం బొట్టు చిందినా.. రక్తం ఏరులై పారడం ఖాయం: రషీద్ వార్నింగ్

యూరీ ఘటన నేపథ్యంలో భారత్‌ను పాకిస్థాన్ హెచ్చరించింది. జమ్మూకాశ్మీర్‌లో రక్తం బొట్టు చిందినా రక్తం ఏరులై పారడం ఖాయమని పాకిస్థాన్ సమాచారశాఖా మంత్రి పర్వైజ్ రషీద్ భారత్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. యూర

Advertiesment
Pakistan minister serious warning to India
, మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (17:55 IST)
యూరీ ఘటన నేపథ్యంలో భారత్‌ను పాకిస్థాన్ హెచ్చరించింది. జమ్మూకాశ్మీర్‌లో రక్తం బొట్టు చిందినా రక్తం ఏరులై పారడం ఖాయమని పాకిస్థాన్ సమాచారశాఖా మంత్రి పర్వైజ్ రషీద్ భారత్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. యూరీ ఘటన తర్వాత పాకిస్థాన్‌ను భారత్ ఏకాకిని చేస్తుందని విమర్శించారు. నిజమైన క్రూరులే ఏకాకులు అవుతారని పేర్కొన్న రషీద్, శ్రీనగర్‌లో అశాంతి నెలకొన్నన్ని రోజులు న్యూఢిల్లీ కూడా ప్రశాంతంగా ఉండబోదని వార్నింగ్ ఇచ్చారు.  
 
ఇదిలా ఉంటే.. యూరీ ఘటనపై పాకిస్థాన్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూరీ ఘటన అనంతరం సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు.. యుద్ధవాతావరణం నెలకొంటే.. ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ లండన్‌లో హాలీడే ట్రిప్‌లో ఎంజాయ్ చేశారని దుయ్యబట్టారు. 
 
ఇస్లామాబాద్‌లో మాజీ క్రికెటర్, అయిన ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ... తూర్పు సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొన్న దశలో ప్రధాని విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. కాగా, అమెరికా వెళ్లిన నవాజ్ షరీఫ్, ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ, కాశ్మీర్‌లో భారత్ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్... ఇది విన్నారా...? లడ్డూలు పాచిపోవచ్చు కానీ డబ్బులు పాచిపోవు... వెంకయ్య