Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్రెయినీ పైలట్ల చేతిలో పాక్ విమానం. గుర్రుపెట్టి రెండు గంటలు నిద్రపోయిన పైలట్.. గాల్లో 305మంది ప్రయాణాలు

పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ పైలట్ ఒకరు తాను నడపాల్సిన విమానాన్ని ట్రెయినీ పైలట్‌లకు వదిలేకి ఎంచక్కా నిద్రపోయాడు. పావుగంట అరగంట కాదు. రెండుగంటలు. 300 మంది ప్రయాణీకులు ప్రాణాలను గాలికి వదిలివేసి అతడు చేసిన

ట్రెయినీ పైలట్ల చేతిలో పాక్ విమానం. గుర్రుపెట్టి రెండు గంటలు నిద్రపోయిన పైలట్.. గాల్లో 305మంది ప్రయాణాలు
హైదరాబాద్ , సోమవారం, 8 మే 2017 (00:59 IST)
విమాన ప్రయాణం అంటే ఇంత నవ్వుతాలు విషయంగా గత వందేళ్లలో ఎన్నడూ జరగలేదు. విమానాల్లో ప్రయాణీకులపై సిబ్బంది వేధింపు ఘటనలు ఇటీవల చాలా తరచుగా జరిగిపోతుంటే మరోవేపున విమాన ప్రయాణమే లారీ జర్నీలాగా మారిపోయింది. లారీ డ్రైవర్ తనకు నిద్ర వస్తున్నప్పుడో లేక తన క్లీనర్‌కు బండి డ్రైవింగ్ అనుభవం ఇవ్వాలనో ఉన్నట్లుండి డ్రయివర్ సీటును క్లీనర్‌కు ఇచ్చేయడం అలవాటు. కానీ లారీ డ్రయివర్ రెస్టులో ఉన్నప్పుడు కూడా క్లీనర్ బండి సరిగా నడుపుతున్నాడా లేదా అనే విషయాన్ని బండి కుదుపుల ద్వారా పసిగట్టి వెంటనే క్లీనర్‌ను అలర్ట్ చేస్తుంటాడు. కానీ విమాన కెప్టెన్లకు ఈ విధమైన అప్రమత్తత కూడా లేనట్లుంది. పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ పైలట్ ఒకరు తాను నడపాల్సిన విమానాన్ని ట్రెయినీ పైలట్‌లకు వదిలేకి ఎంచక్కా నిద్రపోయాడు. పావుగంట అరగంట కాదు. రెండుగంటలు. 300 మంది ప్రయాణీకులు ప్రాణాలను గాలికి వదిలివేసి అతడు చేసిన చర్య విమాన ప్రయాణమంటేనే వణుకు తెప్పిస్తోంది.
 
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 305మంది ప్రాణాలను ఓ పైలట్‌ ప్రమాదపుటంచుల్లో పెట్టాడు. పోతే పోయారులే అన్న చందంగా వ్యవహరించాడు. టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే విమానాన్ని ట్రెయినీ పైలట్‌లకు వదిలేసి ఏం చక్కా వెళ్లి బిజినెస్‌ క్లాస్‌లో గుర్రుమంటూ నిద్రపోయాడు. అది ఒకటి రెండు నిమిషాలు కాదు.. దాదాపు రెండుగంటలపాటు. ఈ విషయం ఓ ప్రయాణీకుడి ద్వారా వెలుగు చూసింది.
 
ఇస్లామాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన విమానంలో పాక్‌కు చెందిన సీనియర్‌ పైలెట్‌ అమిర్‌ అఖ్తర్‌ హంషీ విమానాన్ని శిక్షణలో ఉన్న పైలట్‌లకు వదిలేసి రెండున్నర గంటలపాటు నిద్రపోయాడు. అక్కడే ఉన్న ఓ ప్రయాణీకుడు అతడు నిద్ర పోతున్న ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో పెట్టడంతోపాటు అతడిపై విమానయాన అధికారులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద హల్‌ చల్‌ అవుతున్నాయి. ఏప్రిల్‌ 26న ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పాక్‌ అధికారులు విచారణకు ఆదేశించారు.
 
ఈ ఘోరానికి పాల్పడిన పాక్ విమాన కెప్టెన్‌పై మొదట్లో ఎలాంటి చర్యా తీసుకోవడానికి సిద్ధపడని పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ తర్వాత పై స్తాయిలో వచ్చిన ఒత్తిడి వల్ల విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఆ కెప్టెన్‌ను విధులనుంచి తప్పించారు
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్షణ కోసం ఠాణాకు వెళితే ప్రేమ జంటను చితక్కొట్టిన సీఐ సాబ్.. కడపలో కలకలం...