Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

రక్షణ కోసం ఠాణాకు వెళితే ప్రేమ జంటను చితక్కొట్టిన సీఐ సాబ్.. కడపలో కలకలం...

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించిన ఓ ప్రేమ జంటపై సీఐ సార్ తన ప్రతాపం చూపించాడు. తన చేతిలో లాఠీ విరిగిపోయేలా చితక్కొట్టాడు. ఈ దారుణం కడప జిల్లా కేంద్రంలోనే జరిగింది. స్థా

Advertiesment
Kadapa
, ఆదివారం, 7 మే 2017 (14:55 IST)
పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించిన ఓ ప్రేమ జంటపై సీఐ సార్ తన ప్రతాపం చూపించాడు. తన చేతిలో లాఠీ విరిగిపోయేలా చితక్కొట్టాడు. ఈ దారుణం కడప జిల్లా కేంద్రంలోనే జరిగింది. స్థానికంగా కలకలం రేపుతున్న ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కడప పట్టణంలోని ఆకులవీధులో ఉండే మౌనిక.. అశోక్ నగర్‌‌కు చెందిన హర్షవర్ధన్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరు కావడంతో మౌనిక తల్లిదండ్రులు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. పెద్దలను ఎదిరించి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంతరం రక్షణకోసమని జిల్లాలోని చిన్నచౌక్ పోలీసులను ఆశ్రయించారు. ఇరువురినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన సీఐ రామకృష్ణ విచక్షణా రహితంగా కొట్టి నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు.
 
దీంతో పోలీస్ స్టేషన్‌‌లోనే మౌనిక సొమ్మసిల్లి పడిపోయింది. అబ్బాయి తరపు బంధువులు 108వాహనాన్ని పిలిపించగా.. ఆగ్రహించిన సీఐ ఆ వాహనాన్ని తిరిగి పంపించేశారని బంధువులు ఆవేదన వ్యక్తంచేశారు. ఒక ఆడబిడ్డను పట్టుకుని బాధ్యతగల సీఐ విచక్షణా రహితంగా కొట్టడమేంటి.?.. ఒక వేళ మా బిడ్డ చనిపోయివుంటే మీరు ఏం చేసివుండే వాళ్లంటూ బాధితురాలి బంధువులు పోలీసులను ప్రశ్నించారు.
 
కానీ, సీఐ వాదన మాత్రం మరోలా ఉంది. పోలీసులను ఆశ్రయించగానే ఇద్దర్నీ వారి తల్లిదండ్రులకు అప్పజెప్పాము.. ఈ క్రమంలో మౌనిక ఇంటికిపోను అని మొరాయించడంతో ఆ యువతి తండ్రి బుద్ది చెప్పడం జరిగింది.. దీన్ని ఆసరాగా తీసుకుని హర్షవర్ధన్‌‌ను సంబంధించిన కొంతమంది బయటి వ్యక్తులు వచ్చి మౌనికను ఇంటికి తీసుకెళతామన్నారు. అంతే ఆ తర్వాత ఏం జరిగిందో తమకు తెలియదంటూ సీఐ చెప్పడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయిల కోసం ఉగ్రవాదులను వదిలిపెట్టిన నైజీరియా