పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ నిజస్వరూపాన్ని ఆ దేశ పాలకులు బయటపెట్టే సాహయం చేయలేకపోయినా.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు, మాజీ సర్వ సైన్యాధిపతి పర్వేజ్ ముషారఫ్ మాత్రం ఆ పని చేశారు. భారత్‌లో దాడులకు తీవ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ సంస్థను ఐఎస్ఐ వాడుకుంటుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
టెలిఫోన్ ఇంటర్వూలో ఓ పాకిస్థాన్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు ముషారఫ్ పైవిధంగా సమాధానమిచ్చారు. 2003లో జైషే సంస్థ తనను హత్య చేయడానికి పలుమార్లు యత్నించిందన్నారు. జైషేపై చర్యలు తీసుకోవడాన్ని అభినందిస్తున్నాని చెప్పారు. అయితే జర్నలిస్టు అడిగిన మరో ప్రశ్నకు కూడా సమాధానమిచ్చారు.
మీరు అధికారంలో ఉన్న సమయంలో జైషేపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగగా, అప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, తాను సాహసం చేయడానికి ప్రయత్నించలేదని సెలవిచ్చారు. పుల్వామా దాడి కూడా జైషేనే చేసిందని చెప్పారు.