Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుజరాత్ దెబ్బకు గిలగిలా కొట్టుకుంటున్న పాకిస్థాన్ - మిర్చి.. టమోటా అన్నీ బంద్...

గుజరాత్ రాష్ట్ర వ్యాపారులు తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో పాకిస్థాన్ గిలగిలా కొట్టుకుంటుంది. గుజరాత్ నుంచి పాకిస్థాన్‌కు ఎగుమతి అయ్యే అన్ని రకాల సరకులను నిలిపివేయాలని తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో పొరుగు దేశ

గుజరాత్ దెబ్బకు గిలగిలా కొట్టుకుంటున్న పాకిస్థాన్ - మిర్చి.. టమోటా అన్నీ బంద్...
, శనివారం, 8 అక్టోబరు 2016 (13:05 IST)
గుజరాత్ రాష్ట్ర వ్యాపారులు తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో పాకిస్థాన్ గిలగిలా కొట్టుకుంటుంది. గుజరాత్ నుంచి పాకిస్థాన్‌కు ఎగుమతి అయ్యే అన్ని రకాల సరకులను నిలిపివేయాలని తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో పొరుగు దేశం అల్లాడిపోతోంది. ఈ నిర్ణయం వల్ల రైతులు, వ్యాపారులకు రోజుకు మూడు కోట్ల రూపాయల నష్టం వస్తున్నా.. జాతి ప్రయోజనాల ముందు దాన్ని తాము లెక్క చేయబోమని రైతులు స్పష్టం చేస్తున్నారు. 
 
తమ రాష్ట్రం నుంచి పొరుగు దేశానికి కూరగాయలు.. ముఖ్యంగా టమోటాలు, మిర్చి ఎగుమతి చేయకూడదని వ్యాపారులు నిర్ణయించుకున్నారు. దీనివల్ల గుజరాత్‌లోని రైతులు, వ్యాపారులకు రోజుకు దాదాపు రూ.3 కోట్ల మేర నష్టం వస్తుంది. అయినా సరే, పాక్‌కు మాత్రం కూరగాయలు పంపేది లేదని తేల్చి చెపుతున్నారు. దాంతో కూరగాయలు, పచ్చిమిర్చి దొరక్క పాక్ ప్రజలు తల్లడిల్లారు.  
 
ప్రతిరోజూ అహ్మదాబాద్ నుంచి 50 ట్రక్కులలో టమోటాలు, మిర్చి వాఘా సరిహద్దు గుండా వెళ్తాయి. కానీ, వాటిని ఇప్పుడు ఆపేసినట్లు అహ్మదాబాద్ జనరల్ కమీషన్ ఏజెంట్ల సంఘం ప్రధాన కార్యదర్శి అహ్మద్ పటేల్ తెలిపారు. 1997 నుంచి ఇప్పటివరకు ఇలా ఆపడం ఇదే మొదటిసారని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యేవరకు వాళ్లకు కూరగాయలు పంపబోమని పటేల్ స్పష్టం చేశారు. అయితే బంగ్లాదేశ్, గల్ఫ్ దేశాలు, కెనడా, దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు మాత్రం పంపుతూనే ఉంటామని చెప్పారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తేడా వస్తే తోక కత్తిరిస్తా : జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్