Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తేడా వస్తే తోక కత్తిరిస్తా : జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్

జిల్లా కలెక్టర్లకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తేడా వస్తే తోక కత్తిరిస్తా అంటూ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ల సమావేశం మొదటి రోజు శుక్రవారం రాత్రి 10.30కి ముగిసింది.

తేడా వస్తే తోక కత్తిరిస్తా : జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్
, శనివారం, 8 అక్టోబరు 2016 (12:50 IST)
జిల్లా కలెక్టర్లకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తేడా వస్తే తోక కత్తిరిస్తా అంటూ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ల సమావేశం మొదటి రోజు శుక్రవారం రాత్రి 10.30కి ముగిసింది. రెండవ రోజు ఉదయం తొమ్మిది గంటలకే సమావేశం అని సీఎం చెప్పారు. తొమ్మిదింపావుకే ఆయన వచ్చేశారు. నిద్రమత్తు వదిలించుకుని వచ్చిన అధికారులు ఎట్టకేలకు సమావేశం ప్రారంభమైందనుకున్నారు. 
 
మార్నింగ్ సెషన్ పూర్తయి, మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో సుష్టిగా తిన్నారు. ఈ సమయంలోనే సీ.ఎం.ఓ అధికారుల నుంచి "సర్ రమ్మంటున్నారంటూ'' కబురు అందింది. సదస్సులో మరో ఇంటర్నల్ మీటింగ్ ఏమిటని నిట్టూర్పు విడుస్తూ కలెక్టర్లు సీఎం రూములోకి వెళ్లారు. బయటికి వచ్చేసరికి తిన్న మత్తు వదిలింది. తత్వం బోధపడింది. చంద్రబాబు చెప్పిందంతా విని ఏసీ రూమ్‌లో నుంచి బయటకు వచ్చేసరికి కలెక్టర్లకు చెమటలు పట్టాయి. లోపలేమి జరిగిందో మీరే చూడండి.
 
"జిల్లాలో కొంతమంది కలెక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి నియోజకవర్గాల్లో రెండు లక్షల మంది ప్రజలతో ఎన్నుకోబడినవాళ్లు.. వారు మీ దృష్టికి తీసుకువచ్చిన ప్రజాసమస్యలను సానుకూలంగా పరిశీలించండి. కొంతమంది కలెక్టర్లు ఫోన్లు ఎత్తకుండా, మంత్రులు చెప్పిన పనులు కూడా చేయడం లేదనే సమాచారం అందుతోంది. మీరు నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించండి. 
 
కానీ, ముందు చెప్పింది వినండి. రెండున్నర సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల వద్దకు వెళితేనే, వారు 80 శాతం వరకు సంతృప్తి చెందితేనే మేము మళ్లీ అధికారంలోకి వస్తాము. ఆ విషయాన్ని మీరూ గుర్తించుకోవాలి. ఇష్టంలేకపోతే చెప్పండి.. వేరేవాళ్లు వచ్చి చేస్తారు..'' అంటూ కాస్తంత గట్టిగానే చంద్రబాబు తేల్చిచెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నగ్న చిత్రాలు చిత్రీకరించేందుకు.. బాత్రూమ్‌లో సీసీటీవీ కెమెరాలు పెట్టాడు.. అడ్డంగా బుక్కయ్యాడు