Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2025 నాటికి పాకిస్థాన్ చేతిలో 250 న్యూక్లియర్ వార్‌హెడ్స్- అమెరికా

పాకిస్థాన్ భారీ ఎత్తున అణ్వాయుధ సంపదను పెంచుకుంటుంది. ఈ వ్యవహారం ప్రపంచ దేశాలతో పాటు భారత్‌కు కూడా ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఇప్పటికే పాకిస్థాన్ వద్ద 140 నుండి 150 వరకు న్యూక్లియర్ వార్‌హెడ్స్

2025 నాటికి పాకిస్థాన్ చేతిలో 250 న్యూక్లియర్ వార్‌హెడ్స్- అమెరికా
, గురువారం, 6 సెప్టెంబరు 2018 (14:05 IST)
పాకిస్థాన్ భారీ ఎత్తున అణ్వాయుధ సంపదను పెంచుకుంటుంది. ఈ వ్యవహారం ప్రపంచ దేశాలతో పాటు భారత్‌కు కూడా ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఇప్పటికే పాకిస్థాన్ వద్ద 140 నుండి 150 వరకు న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయి. ఈ వార్‌హెడ్స్ సంఖ్యను మరింతి అధికంగా పెంచుకునే దిశగా పాకిస్థాన్ వడివడిగా అడుగులు వేస్తోంది. వచ్చే ఏడేళ్లలో వార్‌హెడ్స్‌ను 220 నుండి 250 వరకు పెంచుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
 
ఈ క్రమంలో 2025వ సంవత్సరానికి వార్‌హెడ్స్‌ను పెంచేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తుందనే విషయాన్ని అమెరికా స్పష్టం చేసింది. ఇదే వేగంతో పాకిస్థాన్ ముందుకెళ్తే.. ప్రపంచంలోనే అత్యధికంగా వార్‌హెడ్స్ ఉన్న ఐదవ దేశంగా నిలుస్తుందని అమెరికన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఓ నివేదికలో తెలియజేశారు. అంతేకాకుండా 2020కి పాకిస్థాన్ మరో 80 న్యూక్లియర్ వార్‌హెడ్స్‌ను సమకూర్చుకుంటుంది. అలాగే 2025 నాటికి పాకిస్థాన్ చేతిలో 250 న్యూక్లియర్ వార్ హెడ్స్‌ను కైవసం వుంచుకుంటుందని అమెరికా స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దటీజ్ కేసీఆర్... తెలంగాణ అసెంబ్లీ రద్దుకు కేబినెట్ తీర్మానం...