నవాజ్ షరీఫ్‌కు కొత్త చిక్కులు.. కుటుంబ సభ్యులపై కేసులు.. ఎందుకు?
పనామా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రధాని పదవిని కోల్పోయారు. తాజాగా షరీఫ్ ఫ్యామిలీ మరిన్ని చిక్కుల్లో పడింది. పాకిస్థాన్‌కు చెందిన నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో-ఎన్‌ఏబీ మరో నాలుగు అవినీ
పనామా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రధాని పదవిని కోల్పోయారు. తాజాగా షరీఫ్ ఫ్యామిలీ మరిన్ని చిక్కుల్లో పడింది. పాకిస్థాన్‌కు చెందిన నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో-ఎన్‌ఏబీ మరో నాలుగు అవినీతి ఆరోపణ కేసులను షరీఫ్‌పై పెట్టింది.
ఈ కేసుకు సంబంధించిన మిగిలిన అవినీతి ఆరోపణలను కూడా షరీఫ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని జూలై 18 నాటి తీర్పు సమయంలో సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఈ కేసులు నమోదైనాయి. ఆ కేసులు నవాజ్ షరీఫ్ ఆయన కుమారులు హసన్, హుస్సేన్, కూతురు మరియామ్, అల్లుడు మహ్మద్ సఫ్దార్, ఇష్క్‌దార్‌పై నమోదైనాయి. ఈ కేసులకు విలువైన ఆధారాలను విచారణలో భాగంగా సేకరించినట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన నవాజ్ షరీఫ్ నియోజకవర్గమైన లాహోర్ పార్లమెంటరీ స్థానానికి ఉపఎన్నిక సెప్టెంబర్ 17న నిర్వహించనున్నట్టు పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. నవాజ్ షరీఫ్ పీఎంల్-ఎన్ పార్టీ నుంచి నవాజ్ సోదరుడైన షెహబాజ్ షరీప్ పోటీ చేయనుండగా, పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ నుంచి డాక్టర్ యాస్మిన్ రషీద్ పోటీ చేయనున్నారు.