భారత్‌పై అణ్వస్త్ర దాడి చేయడానికైనా రెడీ : పాక్ రక్షణ మంత్రి
భారత్‌పై పాకిస్థాన్ కపట బుద్ధేంటో బయటపడింది. పాకిస్థాన్ ప్రపంచానికి ఉగ్రవాదులను ఎగుమతి చేసే కర్మాగారంగా మారిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించిన నేపథ్యం
భారత్‌పై పాకిస్థాన్ కపట బుద్ధేంటో బయటపడింది. పాకిస్థాన్ ప్రపంచానికి ఉగ్రవాదులను ఎగుమతి చేసే కర్మాగారంగా మారిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించిన నేపథ్యంలో ఇన్నాళ్లు భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న పాక్, భారత్‌పై తమకు ఉన్న అక్కసును వెల్లగక్కింది.
తమ దేశంపై భారత బలగాలు దాడి చేస్తే తాము ఎంతటి చర్యకైనా దిగుతామని స్పష్టం చేసింది. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని పాక్ ప్రకటించింది. యూరీ ఘటనపై భారత అధికారులు ప్రతీకార చర్యలకు పాల్పాడాలని నిర్ణయించడంతో పాక్ అప్రమత్తం అయ్యింది.
సైనిక సన్నద్ధతపై టాప్ కమాండర్లతో అత్యవసర భేటీ నిర్వహించింది. తమ దేశానికి ముప్పు వాటిల్లితే భారత్‌పై అణ్వస్త్ర దాడి చేయడానికి ఏ మాత్రం వెనుకాడేది లేదని స్పష్టం చేసింది. భారత్ పాక్‌పై దాడికి దిగినట్లయితే భారత్‌పై అణు బాంబులతో దాడి చేస్తామని పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ హెచ్చరించారు.