Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అధ్యక్ష భవనాన్ని మాత్రమే వీడాను... పోరాటాన్ని కాదు.. జో బైడెన్

Advertiesment
joe biden

ఠాగూర్

, మంగళవారం, 21 జనవరి 2025 (10:29 IST)
అమెరికా అధ్యక్ష పీఠం నుంచి జో బైడెన్ దిగిపోయారు. గత యేడాది నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విజయభేరీ మోగించారు. దీంతో ఆయన అమెరికా 47వ అధ్యక్షుడుగా భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అమెరికా అధ్యక్ష బాధ్యతల నుంచి జో బైడెన్ తప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వీడింది కార్యాలయాన్నే కానీ.. పోరాటాన్ని కాదు అని వ్యాఖ్యానించారు.
 
మరోవైపు, అమెరికాకు 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. దీనికి ముందు జో బైడెన్ దంపతులు, ట్రంప్ దంపతులకు సంప్రదాయం ప్రకారం తేనీటి విందునిచ్చారు. బైడెన్ 'వెల్కమ్ హోం' అంటూ ట్రంప్‌ దంపతులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు సంప్రదాయబద్ధంగా లేఖ రాశారా అని విలేకరులు ప్రశ్నించగా.. అవునని బైడెన్ బదులిచ్చారు. 
 
అయితే, అందులో ఏముందనేది రహస్యమన్నారు. ట్రంప్ బాధ్యతల స్వీకరణ అనంతరం బైడెన్ కాలిఫోర్నియాకు పయనమయ్యారు. ఈ క్రమంలో 'మేము వీడింది కార్యాలయాన్నే కాని, పోరాటాన్ని కాదు' అని వ్యాఖ్యానించారు. అంతేకాక.. 'ఈ రోజు ప్రారంభోపన్యాసం విన్నాం.. మనం ఇంకా చేయాల్సింది చాలా ఉంది' అని పేర్కొన్నారు. అనంతరం బైడెన్ దంపతులు హెలికాఫ్టర్ ఎక్కి వెళ్లిపోయారు.
 
కాగా, తాను రాజకీయాల నుంచి వైదొలగబోనని, ప్రజా జీవితంలో కొనసాగుతానని జో బైడెన్ గతంలో స్పష్టంచేశారు. సాధారణంగా అమెరికా అధ్యక్షులుగా పని చేసినవారు పదవి నుంచి వైదొలగగానే ప్రజా జీవితానికి దూరంగా ఉంటారు. కానీ బైడెన్ తాను అలా చేయనని పేర్కొనడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాడు ఉచితం.. నేడు షాకులపై షాకులు.. చార్జీల మోత మోగిస్తున్న జియో