Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Donald Trump: ట్రంప్‌ ప్రమాణ స్వీకారం.. వాషింగ్టన్‌లో భారీ బందోబస్తు.. అమెరికాలో అంబానీ

Advertiesment
Donald Trump

సెల్వి

, సోమవారం, 20 జనవరి 2025 (11:54 IST)
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం కోసం, వాషింగ్టన్‌లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పదివేల మంది సిబ్బందితో కూడిన భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 
 
డొనాల్డ్ ట్రంప్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ట్రంప్‌ ప్రమాణ స్వీకార నేపథ్యంలో…అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. డ్రోన్లతో గగనతలంలో నిఘాను కట్టుదిట్టం చేశారు.
 
"రేడియోలాజికల్ బెదిరింపుల నుండి టైర్లు పగిలిపోవడం వరకు, సీక్రెట్ సర్వీస్ సోమవారం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతూ ఒక సంవత్సరానికి పైగా గడిపింది, సురక్షితమైన, విజయవంతమైన కార్యక్రమాన్ని నిర్ధారించడానికి అగ్ర చట్ట అమలు, ప్రజా భద్రతా భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది" అని సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లియెల్మి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
 
దేశవ్యాప్తంగా 25,000 మందికి పైగా సిబ్బంది భద్రత కోసం మోహరించబడతారని సీక్రెట్ సర్వీస్ స్పెషల్ ఏజెంట్ మాట్ మెక్‌కూల్ ఆదివారం జరిగిన వార్తా సమావేశంలో తెలిపారు. వారిలో 40 రాష్ట్రాల నుండి నేషనల్ గార్డ్ బృందాలు మరియు 32 రాష్ట్రాల నుండి స్వచ్ఛందంగా వచ్చిన పోలీసులు దేశ రాజధాని పోలీసు దళాలకు అనుబంధంగా ఉంటారు.
హెలికాప్టర్లు, డ్రోన్లు గాలి నుండి భద్రతను అందిస్తాయి. 
 
రేడియేషన్ ప్రమాదాలను తనిఖీ చేయడానికి వాషింగ్టన్ మీదుగా తక్కువ ఎత్తులో హెలికాప్టర్ విమానాలను నిర్వహిస్తున్నట్లు అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది. ఫస్ట్‌ డే , ఫస్ట్‌ వీక్‌, హండ్రెస్‌ డేస్‌. తాను ఏం చేయబోతున్నానో విందుకు ముందు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో చెప్పారు ట్రంప్‌. అమెరికా అధ్యక్ష చరిత్రలో తొలి 100 రోజుల్లోనే కనీవినీ ఎరుగనిరీతిలో అసాధారణ నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారాయన. గొప్ప విజయాన్ని అందించిన ప్రజలను రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానన్నారు.
 
ట్రంప్ ప్రమాణం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 18న అంబానీ దంపతులు అమెరికా చేరుకున్నారు. ఈ క్రమంలో ట్రంప్‌ ఏర్పాటు చేసిన క్యాండిల్‌లైట్‌ డిన్నర్‌లో అంబానీ దంపతులు పాల్గొన్నారు. ఈ విందుకు రావాలంటూ దాదాపు 100 మందికి ఆహ్వానం అందినట్లు సమాచారం. ఈ జాబితాలో భారత్‌ నుంచి అంబానీ దంపతులు మాత్రమే ఉన్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో మరో తెలంగాణ బిడ్డ చనిపోయాడు.. ఎందుకో తెలుసా?