Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా పొగరు అణిచేస్తాం : ఉత్తర కొరియా లేటెస్ట్ వీడియో

అగ్రరాజ్యం అమెరికాకు ఉత్తర కొరియా మరోమారుగట్టి హెచ్చరిక చేసింది. అమెరికా సైనిక స్థావరాలు కలిగివున్న గువామ్ దీవిపై దాడి చేస్తామంటూ ఉత్తర కొరియా గత కొన్ని రోజులుగా హెచ్చరికలు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertiesment
అమెరికా పొగరు అణిచేస్తాం : ఉత్తర కొరియా లేటెస్ట్ వీడియో
, మంగళవారం, 22 ఆగస్టు 2017 (09:04 IST)
అగ్రరాజ్యం అమెరికాకు ఉత్తర కొరియా మరోమారుగట్టి హెచ్చరిక చేసింది. అమెరికా సైనిక స్థావరాలు కలిగివున్న గువామ్ దీవిపై దాడి చేస్తామంటూ ఉత్తర కొరియా గత కొన్ని రోజులుగా హెచ్చరికలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాపై ఉత్తరకొరియా క్షిపణులు దాడి చేస్తున్నట్టు ఆ పోస్టర్లలో ముద్రించారు. తాజాగా ఉత్తరకొరియా ఓ యానిమేటెడ్ వీడియోను విడుదల చేసింది. 
 
ఈ వీడియోలో గువామ్‌పై దాడి ఘటనను చూపించింది. ఈ సందర్భంగా ఆ వీడియోలో ఒక్కదెబ్బతో అమెరికా పొగరు అణుగుతుంది, ప్రపంచంలో మేమే అధికులమనే అమెరికా మూర్ఖులు ఊహల్లో తేలియాడుతున్నారు. తమ హవాంగ్-14 న్యూక్లియర్ మిస్సైల్ వారి పొగరు అణచుతుంది అని ఉత్తరకొరియా ఆ వీడియోలో పేర్కొంది.
 
అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమాధి సిలువాలతో నిండిపోతుంది. పాపాత్ములైన అమెరికన్లకు నరకమే గతి అని పేర్కొంది. అమెరికాతో తలపడేందుకు ఉత్తరకొరియా సర్వసన్నద్ధంగా ఉందని ఆదేశం ప్రకటించింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నంద్యాలలో టీడీపీకి ఓటమి ఖాయమా? భన్వర్‌లాల్‌పై టీడీపీ ఫిర్యాదు