ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ అమెరికాతో తలపడటానికి తమ దేశం రెడీగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కిమ్ జోంగ్ ఉన్ తమ దేశం అమెరికాతో అణు యుద్ధం చేయడానికైనా, సైనికులతో దాడి చేయడానికైనా సిద్ధమే అంటూ సవాలు విసిరారు.
అది కూడా జూలై 27 ఉత్తర కొరియా యుద్ధ విరమణ దినోత్సవానికి సంబంధించి 69వ వార్షికోత్సవం సందర్భంగా కిమ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 2017 నుంచి ఉత్తర కొరియా అణు పరీక్షలు నిర్వహించినప్పుడే యుద్ధానికి పరోక్షంగా కాలుదువ్వుతున్నట్లు సంకేతం ఇచ్చింది.
తమ సాయుధ బలగాలు ఎలాంటి దాడినైనా తిప్పికొట్టగల సమర్థవంతమైనవని., అణ్వాయుధాల పరంగా కూడా చాలా బలమైనదని.. తక్షణమే ఈ యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉందని కిమ్ స్పష్టం చేశారు. అంతేకాదు దక్షిణ కొరియాతో అమెరికా చట్టవిరుద్ధమైన శత్రుచర్యలు కొనిసాగిస్తోందని ఆరోపించారు.