ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధం జరగడానికి అగ్రరాజ్యం అమెరికానే ప్రధాన కారణమని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ ఆరోపించింది. ఈ మేరకు ఓ ప్రకటనను తమ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. రష్యా దేశ భద్రత పట్ల డిమాండ్లను నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన ఉ.కొరియా అమెరికా తన మిలిటరీ ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపణలు గుప్పించింది.
"వాషింగ్టన్ తన భద్రత కోసం రష్యా చట్టబద్ధమైన డిమాండ్‌ను పట్టించుకోకుండా సైనిక ఆధిపత్యాన్ని అనుసరించింది. యుక్రేనియన్ సంక్షోభానికి మూల కారణం కూడా అమెరికానే. తన మిలిటరీ ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ఇలా ఏకపక్షంగా వ్యవహరించింది" అని ఆ పోస్టులో పేర్కొంది.