Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతీయ మహిళలకు శృంగారం గురించి అస్సలు తెలియదు.. చెప్పిందెవరంటే?

భారతీయ మహిళలకు శృంగారం గురించి అస్సలు తెలియదు.. చెప్పిందెవరంటే?
, శనివారం, 5 సెప్టెంబరు 2020 (17:22 IST)
Richard Nixon
అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ భారతీయ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భారతీయులకు శృంగారం గురించి తెలియదు. భారతీయ మహిళల్లాంటి అనాకారి మహిళలు ఈ ప్రపంచంలోనే లేరు. వాళ్లను చూస్తూనే కడుపులో తిప్పుతుంది. వాళ్లకు శృంగారం గురించి అసలు తెలియదు. దాన్ని ఆస్వాదించడం చేతకాదు..' అని అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కారుకూతలు కూసిన సంగతి వెలుగులోకి వచ్చింది. 
 
1969 నుంచి 1974 మధ్య అమెరికా అధ్యక్షుడి పనిచేసిన నిక్సన్ 1994లో మృతి చెందారు. 1971 నాటి పాకిస్థాన్, భారత్ యుద్ధ సమయంలో అతడు భారతీయులపై చేసిన వ్యాఖ్యల ఆడియోలను అమెరికా ప్రభుత్వం రహస్య జాబితా నుంచి తొలగించి బహిర్గతం చేసింది.
 
1971 జూన్ 17న అధికారులతో జరిపిన సమావేశంలో నిక్సన్ నోరు పారేసుకున్నారు. 'భారతీయ మహిళల్లో ఆకర్షణ లేదు.. ఆఫ్రికా నల్లజాతి వారిలో మెరుపు కనిపిస్తుంది. జంతువుల్లో ఉండే ఆకర్షణేదో వారిలో ఉంది. కానీ ఈ భారతీయులను చూస్తే మాత్రం చీదరింపు పుడుతుంది. వాళ్లను దేవుడెలా పుట్టించాడబ్బా అని జాలి కలుగుతుందని తెలిపారు.
 
భారత్, పాక్ యుద్ధం విషయంలో అమెరికా పాక్ వైపు మొగ్గుచూపింది. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీకి చెందిన గేరీ బాస్ అనే ప్రొఫెసర్ వినతి మేరకు ప్రభుత్వం నాటి సమావేశం ఆడియోలను బహిర్గతం చేసింది. అయితే దేశాధ్యక్షల ఎన్నికల సమయంలో వీటిని బయటపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అడ్డాగా మారిన ఛత్తీస్‌గఢ్‌.. 25 మంది కిడ్నాప్.. నలుగురు హతం