కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. మొన్నటి వరకు కేసులు తగ్గినప్పటికి తాజాగా పలుదేశాల్లో కేసులు పెరుగుతుండడం కలవరపెడుతోంది.
ఇక ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి.
కొన్ని చోట్ల వ్యాక్సిన్లు వికటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా వ్యాక్సిన్ తీసుకున్న మహిళ మరణించడం ఆందోళన రేపుతోంది. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది.
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ మహిళ చనిపోయినట్లు న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అత్యంత అరుదైన మయోకార్డిటిస్ (గుండె కండరాల్లో ఇన్‌ఫ్లేమేషన్) వల్ల ఆ మహిళ మరణించినట్లు తాము భావిస్తున్నట్లు చెప్పారు.
పైజర్ వ్యాక్సిన్ వల్ల న్యూజిలాండ్‌లో సంభవించిన తొలి మరణం ఇదేనని చెప్పింది. ఆ మహిళ వయస్సు మాత్రం చెప్పలేదు. ఆ మహిళ ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోందని వెల్లడించింది.