న్యూజిలాండ్‌లోని ఆరోగ్య నిబంధనల ప్రకారం ఇంట్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే, ఆ కుటుంబసభ్యులు ఏడు రోజుల పాటు ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది.
కరోనా వైరస్ తొలి కేసు నమోదైన తర్వాత అత్యంత కఠినంగా ఆంక్షలను అమలుచేసిన దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. దేశంలో ఇప్పటివరకు 892 మంది వైరస్ కారణంగా మరణించారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇదే అత్యల్పం. అయితే కరోనా వ్యాప్తి తగ్గడంతో దేశవ్యాప్తంగా మార్చి నెలలో ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో అప్పటినుంచి ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగాయి. తాజాగా న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిందా అర్డర్న్ కరోనా బారినపడ్డారు.
శుక్రవారం సాయంత్రం నుంచి కొవిడ్ లక్షణాలు కనిపించాయని, శనివారం ఉదయం రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నిర్వహించగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
అయితే, తనకు మహమ్మారి సోకకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా, వైరస్ సోకిందంటూ జసిందా అర్డెన్స్ ఇస్టాగ్రామ్‌లో తన ఫొటోను పోస్ట్ చేశారు. అయితే, రాబోయే వారంలో న్యూజిలాండ్ ప్రభుత్వ వార్షిక బడ్జెట్ విడుదల చేయాల్సి ఉంది. కొవిడ్ టీకాలు వేయించుకున్నా జసిందా కరోనా బారిన పడ్డారు.
ఇప్పటికే న్యూజిలాండ్ ప్రధాని కాబోయే భర్త క్లార్క్ గేఫోర్డ్‌కు కరోనా సోకింది. ఆ తర్వాత ఆదివారం నుంచి ఆమె వెల్లింగ్టన్ నివాసంలో ఒంటరిగా ఉన్నారు.
తన మూడేళ్ల కుమార్తె నీవ్‌కు బుధవారం వైరస్ పాజిటివ్‌గా తేలిందని ఆమె వెల్లడించారు. ఒమిక్రాన్ ఆంక్షల కారణంగా జసిండా అర్డెర్న్ తన వివాహాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తన కుటుంబసభ్యులతో పాటు తనకు కరోనా సోకడం దురదృష్టకరమన్నారు.