Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Disease Xతో ముప్పు.. ఐదేళ్లకు ఓసారి విజృంభించే ఛాన్స్!

Disease Xతో ముప్పు.. ఐదేళ్లకు ఓసారి విజృంభించే ఛాన్స్!
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (22:10 IST)
Disease X
కరోనా వైరస్‌కు మించిన మరిన్ని వ్యాధులు ప్రపంచాన్ని వణికించనున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 'Disease X' అని పిలుస్తున్న ఒక ప్రాణాంతక మహమ్మారి ప్రతి ఐదేళ్లకు ఒకసారి విజృంభించే అవకాశాలు ఉన్నాయని వారు చెప్తున్నారు. దీని ప్రభావం కరోనావైరస్‌ కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మూడేళ్ల క్రితం Disease X అనే ఒక ప్లేస్ హోల్డర్ పేరును గుర్తించింది. 
 
ఈ వ్యాధి ఇప్పటికి ఇంకా వెలుగు చూడలేదు. కానీ భవిష్యత్తులో అంటువ్యాధులకు కారణమయ్యే ఒక ఊహాత్మక, ఇంకా తెలియని రోగకారకంగా దీన్ని గుర్తిస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి అనుకోని విపత్తులను సమర్థంగా ఎదుర్కోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
 
జాన్ విడల్ అనే ఎన్విరాన్‌మెంటల్ రైటర్ మరో విషయం చెప్పారు. ప్రకృతికి, వ్యాధికి మధ్య ఉన్న సంబంధం గురించి వివరిస్తూ ఆయన ఒక పుస్తకం రాస్తున్నారు. తట్టు, ఎబోలా వంటి ప్రాణాంతకమైన కొత్త వ్యాధులు, అంటువ్యాధులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఇప్పుడు మానవజాతి కొత్త వ్యాధుల తుఫానులను ఎదుర్కొ౦టు౦దని డాక్టర్ జోసెఫ్ సెట్టెల్ అనే శాస్త్రవేత్త చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రేకప్ ఇస్తావా..? ముఖం మీద కాఫీ పోసిన చైనా యువతి