Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేపాల్ విమాన ప్రమాదం- తెనాలిలో చదివిన కో-పైలెట్ అంజు

Anju Khatiwada
, మంగళవారం, 17 జనవరి 2023 (19:29 IST)
Anju Khatiwada
2006లో దీపక్ ఒక చిన్న యతి ఎయిర్ లైన్స్ ప్యాసింజర్ విమానాన్ని నడుపుతూ ప్రమాదంలో మరణించారు. ఆయనది ఇప్పటికీ విషాద గాధగా మారిపోయింది. ఆ తర్వాత, అతని భార్య అంజు ఖతివాడా తన భర్త భీమా నుండి పొందిన డబ్బును తన స్వంత పైలట్ శిక్షణ కోసం చెల్లించడానికి ఉపయోగించింది. ఐతే ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలిలో రెండేళ్లపాటు విద్యాభ్యాసం చేసారు.
 
నేపాల్‌లోని పోఖారాలోని కొత్త విమానాశ్రయంలో కూలిపోయిన యతి ఎయిర్ లైన్స్ విమానాన్ని నడిపిన కో పైలట్  అంజు ఖతివాడా. 44 ఏళ్ల ఖతివాడ ఇక లేరన్న విషయాన్ని ఆమె బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు.
 
ఆమె ఇన్స్ట్రక్టర్ పైలట్‌తో విమానాన్ని నడుపుతోంది. ఖతివాడా తమకు వ్యక్తిగతంగా తెలుసునని పేరు వెల్లడించని విమానయాన అధికారి చెప్పారు. ఏ డ్యూటీ అయినా చేయడానికి ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉండేదని, అంతకుముందే పోఖారాకు వెళ్లిందని చెప్పారు.
 
దేశ రాజధాని ఖాట్మండు, దాని రెండవ అతిపెద్ద నగరం పోఖారా మధ్య ఖతివాడా క్రమం తప్పకుండా ప్రసిద్ధ పర్యాటక మార్గంలో ప్రయాణించింది. ఖతివాడ "స్నేహపూర్వక స్వభావం కలిగిందని చెప్పుకొచ్చారు.  అంతేగాకుండా నైపుణ్యం కలిగిన పైలట్ అని కితాబిచ్చారు. వేలాది గంటలు ప్రయాణించిన తరువాత కెప్టెన్ స్థాయికి ఎదిగారని యతి ఎయిర్ లైన్స్ ప్రతినిధి పెంబా షెర్పా అన్నారు. తాము మా అత్యుత్తమ పైలట్‌ను కోల్పోయామని.. షెర్పా తెలిపారు. 
 
ఏటీఆర్-72 టర్బోప్రాప్ విమానం శిథిలాల మధ్య ఖతివాడ అవశేషాలను గుర్తించలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. బాల్కనీ నుంచి విమానం కిందకు దిగడాన్ని వీడియో రికార్డు చేసిన ప్రత్యక్ష సాక్షి ఒకరు అది కిందకు ఎగురుతూ అకస్మాత్తుగా ఎడమవైపుకు దూసుకెళ్లి డైవింగ్ చేయడం చూశానని చెప్పారు. 
 
90 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో తాను, తన స్నేహితులు పోఖారాలోకి దిగడాన్ని ఆస్వాదిస్తున్న దృశ్యాలు కనిపించాయి, అకస్మాత్తుగా వచ్చిన ప్రకంపనలు కెమెరాను అస్థిరంగా తాకాయి, గందరగోళం మధ్య ప్రయాణికులు కేకలు వేయడంతో షాట్ త్వరగా పొగ,మంటలతో నిండిపోయింది. అంతే జరగాల్సిందంతా జరిగిపోయింది 
 
ఇక నేపాల్ విమాన ప్రమాదానికి సంబంధించిన కాక్ పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ - బ్లాక్ బాక్స్ లు అని పిలువబడేవి - రెండింటినీ సోమవారం సంఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్నామని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ-యతి ఎయిర్ లైన్స్ ప్రతినిధి ధృవీకరించారు.
 
నేపాల్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్న కో పైలట్ అంజు ఖతివాడా భర్త కూడా 2006 జరిగిన మరో విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. భర్త మరణానంతరం అంజు యతి నేపాల్ విమానయాన రంగంలో ప్రవేశించారు. 
 
ఎవరెస్ట్ పర్వతంతో సహా ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద పర్వతాలకు నేపాల్ నిలయం, కఠినమైన భూభాగం, దానితో పాటు నాటకీయ వాతావరణ మార్పులు ప్రమాదకరంగా ఎగరడానికి కారణమవుతాయని యతి ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షేర్‌చాట్‌లో 20% ఉద్యోగాల కోత