Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షేర్‌చాట్‌లో 20% ఉద్యోగాల కోత

Advertiesment
20 percent job cuts
భారతీయ యునికార్న్ షేర్‌చాట్ 20 శాతం ఉద్యోగులను తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ అనిశ్చితి కారణంగా వ్యయాలు తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ షేర్‌చాట్ వీడియో యాప్ మాతృ సంస్థ మొహల్లా టెక్ తెలిపింది. షేర్‌చాట్‌లో సుమారు 2,200 మంది ఉద్యోగులు ఉన్నారు. మేనేజ్మెంట్ రోల్స్‌లో ఉన్న సుమారు 500 మందిని తొలగించినట్లు మనీకంట్రోల్ న్యూస్ చానెల్ తెలిపింది.
 
ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి టెజ్ దిగ్గజాలు కూడా గత కొన్ని నెలల్లో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. అమెరికాలో ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఎంతోమంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారు. 2023లో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా 24,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని Layoffs.fyi వెబ్‌సైట్ తెలిపింది. ఈ చానెల్ టెక్ సంస్థలో ఉద్యోగాల కోతను ట్రాక్ చేస్తుంది.
 
భారతదేశంలో టెక్ స్టార్టప్ సంస్థలైన అన్అకాడమీ, మాగ్లిక్స్, అప్‌గ్రాడ్, లీడ్ వంటివి ఈ ఏడాది జనవరి 1 నుంచి ఉద్యోగాల కోతను ప్రకటించాయి. షేర్ చాట్ మొట్టమొదటి స్వదేశీ సోషల్ మీడియా వేదిక. భారతీయ భాషల్లో ఇది కంటెంట్ అందిస్తుంది. గూగుల్, టెమాసెక్, ట్విట్టర్ వంటి పెద్ద పెద్ద సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి. బెంగళూరు నుంచి నడిచే ఈ సంస్థ విలువ సుమారు 5 బిల్లియన్ డాలర్లు. తమకు 18 కోట్ల నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారని షేర్‌చాట్ చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్వాంట్‌ ఫండ్‌ మెరిటార్‌ క్యును విడుదల చేసి మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌