Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 9 March 2025
webdunia

అంతరిక్షంలో ఉండటం ఆనందంగా ఉంది : సునీతా విలియమ్స్

Advertiesment
sunitha williams

ఠాగూర్

, శనివారం, 14 సెప్టెంబరు 2024 (12:39 IST)
బోయింగ్ మమ్మల్ని విడిచి వెళ్లడంపై వ్యోమగామి సునీత విలియమ్స్ స్పందించారు. బోయింగ్ మమ్మల్ని విడిచివెళ్లడం కఠిన వ్యవహారంగా అనిపిస్తుంది. ఈ కారణణంగా మరికొన్ని నెలలు కక్ష్యలోనే గడపాల్సి ఉంటుందని, అయినప్పటికీ అంతరిక్షంలో ఉండటం ఆనందంగా ఉందని, ఇదంతా మా విధుల్లో భాగంగానే భావిస్తున్నట్టు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ చెప్పారు. 
 
సాంకేతిక లోపం కారణంగా వ్యోమగాములను వదిలేసి బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక ఇటీవల ఖాళీగా భూమికి చేరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మెర్ మొదటిసారిగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇందుకోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో న్యూస్ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటుచేశారు. 
 
ఈ సందర్భంగా సునీతా మాట్లాడుతూ.. 'బోయింగ్ మమ్మల్ని విడిచివెళ్లడం కఠిన వ్యవహారంగా అనిపిస్తోంది. దీంతో మరికొన్ని నెలలు కక్ష్యలోనే గడపాల్సి ఉంది. అయినా, అంతరిక్షంలో ఉండటం ఆనందంగా ఉంది. ఇదంతా మా విధుల్లో భాగంగానే భావిస్తున్నాం' అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నప్పటికీ.. ఇక్కడ ఉండటం ఎలాంటి ఇబ్బందికి గురిచేయడం లేదని విల్మెర్ వ్యాఖ్యానించారు.
 
బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్‌లో భాగంగా నాసా ఈ యేడాది జూన్ నెలలో ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. 10 రోజుల మిషన్‌లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మెర్ ఈ స్టార్ లైనర్ వ్యోమనౌకలో జూన్ 5వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరుగు పయనం కావాల్సిఉండగా.. స్టార్ లైనర్ వ్యోమనౌకలోని థ్రస్టర్లలో లోపాలు తలెత్తటంతో పాటు హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. 
 
దీనిని సరిచేసే క్రమంలోనే వ్యోమగాముల తిరుగు ప్రయాణం ఆలస్యమవుతూ వచ్చింది. సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్.. వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్నర్ సురక్షితమే అని చెప్పింది. కానీ, నాసా అందుకు అంగీకరించలేదు. దీంతో స్టార్‌లైనర్ న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్లో సురక్షితంగా కిందకు దిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎర్ర కండువాను తెగ వాడేస్తున్న మెగా ఫ్యామిలీ హీరోలు