Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వచ్చే నెలలో మూడో ప్రపంచ యుద్ధం... జోస్యం చెప్పిన మిస్టిక్ హొరాసియో విల్లెగాస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఓడిపోతారనీ, డోనాల్డ్ ట్రంప్ గెలుపొంది అధ్యక్ష బాధ్యతలు చేపడుతారంటూ జోస్యం చెప్పిన... మిస్టిక్ హొరాసియో విల్లెగాస్ ఇపుడు మరో బాంబు పేల్చాడు. వచ్చే నెలలో మూడో

Advertiesment
వచ్చే నెలలో మూడో ప్రపంచ యుద్ధం... జోస్యం చెప్పిన మిస్టిక్ హొరాసియో విల్లెగాస్
, శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (09:19 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఓడిపోతారనీ, డోనాల్డ్ ట్రంప్ గెలుపొంది అధ్యక్ష బాధ్యతలు చేపడుతారంటూ జోస్యం చెప్పిన... మిస్టిక్ హొరాసియో విల్లెగాస్ ఇపుడు మరో బాంబు పేల్చాడు. వచ్చే నెలలో మూడో ప్రపంచ యుద్ధం జరగబోతోందని తెలిపారు. ఈ యుద్ధాని మూలకారణం అమెరికా అధ్యక్షుడేనని ఆయన తెలిపారు. 
 
ఈయన చెప్పిన ప్రకారం... మే 13న డొనాల్డ్ ట్రంప్ ద్వారా మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ఫాతిమా మాత 1917లో పోర్చుగల్‌ను సందర్శించారని, ఇది జరిగి వందేళ్లయిన సందర్భంగా ఈ ఏడాది మే 13న యుద్ధం ప్రారంభమై అక్టోబరు 13న ముగుస్తుందని తెలిపాడు. 
 
ట్రంప్ తొలుత సిరియాపై దాడి చేస్తారని, ఇది రష్యా, ఉత్తరకొరియా, చైనాతో ఘర్షణకు దారి తీస్తుందని పేర్కొన్నాడు. ఫలితంగా మూడో ప్రపంచం యుద్ధం జరుగుతుందన్నాడు. ఈ యుద్ధంతో భారీ వినాశనం తప్పదని, మానవాళికి అపారనష్టం కలుగుతుందని మిస్టిక్ ఆవేదన వ్యక్తం చేశాడు.
 
కాగా, టెక్సాస్‌కు చెందిన మిస్టిక్ తనకు అతీంద్రియశక్తులు ఉన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. 2015లోనే అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ చేపడుతారని జోస్యం చెప్పిన ఆయనపై చాలామందికి గురి ఉంది. దీంతో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా అత్త త్యాగశీలి... జయలలిత - శశికళ సంభాషణల వీడియో లీక్ చేస్తా : జయానంద్