Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా అత్త త్యాగశీలి... జయలలిత - శశికళ సంభాషణల వీడియో లీక్ చేస్తా : జయానంద్

మా అత్త శశికళ త్యాగశీలి అని, అపోలో ఆస్పత్రిలో ఆమెకు, జయలలితకు ముధ్య జరిగిన సంభాషణల వీడియోను బహిర్గతం చేస్తానంటూ శశికళ అన్న కుమారుడు జయానంద్ దివాకరన్ తాజాగా ప్రటించారు. ఈ మేరకు ఆయన ఈనెల 7వ తేదీన తన ఫేస

Advertiesment
మా అత్త త్యాగశీలి... జయలలిత - శశికళ సంభాషణల వీడియో లీక్ చేస్తా : జయానంద్
, శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (08:57 IST)
మా అత్త శశికళ త్యాగశీలి అని, అపోలో ఆస్పత్రిలో ఆమెకు, జయలలితకు ముధ్య జరిగిన సంభాషణల వీడియోను బహిర్గతం చేస్తానంటూ శశికళ అన్న కుమారుడు జయానంద్ దివాకరన్ తాజాగా ప్రటించారు. ఈ మేరకు ఆయన ఈనెల 7వ తేదీన తన ఫేస్‌బుక్ ఖాతాలో కొన్ని కామెంట్స్ చేశారు. 
 
ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంపై మాజీ ముఖ్యమంత్రి ఓపీఎస్ వర్గం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో జయానంద్ ఈ తరహా పోస్టింగ్ చేయడం గమనార్హం. 
 
'హత్య ఆరోపణలు చేసినప్పటికీ జయలలిత చికిత్స పొందిన ఫోటోలను బహిర్గతం చేయలేదు. పచ్చగౌను దుస్తు (ఆస్పత్రి దుస్తులు)ల్లో అమ్మను శత్రువులు చూడరాదన్నదే ఏకైక కారణం. ఇది త్యాగమూర్తి చిన్నమ్మ చేసిన పని. సింహాన్ని సింహంలాగే స్వర్గలోకం పాలించేందుకు రాచమర్యాదలతో పంపించాం. 
 
కానీ ఓపీఎస్‌ కేవలం ఓట్ల కోసం పురచ్చితలైవిని శవపేటికలో పెట్టి ప్రచారం చేశారు. నిజం నిప్పులాంటిది. ఏదో ఒక రోజున అమ్మ, చిన్నమ్మ (శశికళ) మధ్య ఆస్పత్రిలో జరిగిన సంభాషణలు వెల్లడైతే...? పీహెచ్‌ పాండ్యన్‌, మనోజ్‌ పాండ్యన్‌, పన్నీర్‌సెల్వం వంటి వారిని ఏం చేయాల్సి ఉంటుందో? ఆ రోజు త్వరలోనే..!' అని జయానంద్‌ తన ఖాతాలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విలీనం ఒక డ్రామాయేనా... అన్నాడీఎంకేలో ఆకస్మిక పరిణామాలపై అనుమానాలు.. పన్నీరు సెల్వం మళ్లీ పావేనా?