Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత యాంకర్ ముందు నీళ్లు నమిలిన ముషారఫ్.. ఆ ముగ్గురు పాక్‌పై విషం చిమ్ముతున్నారు..

భారత్-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై భారత యాంకర్ అడిగిన ప్రశ్నకు పాకిస్థాన్ ఆర్మీ మాజీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ నీళ్లు నమిలారు. అయితే ఆ యాంకర్ పదే పదే ప్రశ్నల వర్షం కురిపించడంతో యాంకర్‌పై

Advertiesment
Musharraf shushes Indian anchorperson over Indo-Pak unrest - Pakistan
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (20:02 IST)
భారత్-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై భారత యాంకర్ అడిగిన ప్రశ్నకు పాకిస్థాన్ ఆర్మీ మాజీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ నీళ్లు నమిలారు. అయితే ఆ యాంకర్ పదే పదే ప్రశ్నల వర్షం కురిపించడంతో యాంకర్‌పై విరుచుకుపడ్డారు. భారత్ యుద్ధ ఆకాంక్షతో రగిలిపోతుందని ముషారఫ్ వ్యాఖ్యానించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్, డీజీఎంఓ రణ్‌బీర్ సింగ్ తదితరులు పాకిస్థాన్‌పై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. 
 
కాశ్మీర్‌లో 80 మందికిపైగా అమాయక ప్రజలను ఇండియన్ ఆర్మీ హత్య చేసిందని ఆరోపించారు. రెండు దేశాలు టెక్నాలజీ పరంగా ముందంజలో ఉన్నాయని, యుద్ధమే కనుక జరిగితే పెద్ద సంఖ్యలో విధ్వంసం జరుగుతుందని హెచ్చరించారు. కాబట్టి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఐరాస జనరల్ అసెంబ్లీ ప్రసంగించిన సుష్మా స్వరాజ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎక్కడా చెప్పకపోగా కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని చెప్పారని ముష్ వ్యాఖ్యానించారు. 
 
ఇదిలా ఉంటే.. కాందహార్ హైజాక్‌లో భారత్ నుంచి విడుదలైన ఉగ్రవాది, జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ వాగడం మొదలుపెట్టాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, భారత మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని నోరు పారేసుకున్నాడు. నిజమైన మెరుపు దాడులంటే ఏమిటో ప్రతి భారతీయుడికి రుచి చూపిస్తామని హఫీజ్ సయీద్ హెచ్చరించాడు. భారత దళాలకు పాక్ ఆర్మీ తగిన విధంగా బుద్ధి చెప్తుందన్నాడు.
  
మరోవైపు ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో తన ప్రసంగాలతో కాశ్మీరీ ముస్లిలను రెచ్చగొట్టి భారత్‌‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉన్నాడు. అతని ఆలోచనలకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అడ్డుతగిలారు. నోరు అదుపులో పెట్టుకోవాల్సిందిగా వార్నింగ్ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసిస్ ఉగ్రవాదుల తలల్ని తెగ్గోసింది.. కూర వండేసింది.. గృహిణి అయినా శభాష్ అనిపించుకుంది..