Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐసిస్ ఉగ్రవాదుల తలల్ని తెగ్గోసింది.. కూర వండేసింది.. గృహిణి అయినా శభాష్ అనిపించుకుంది..

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐసిస్ హైదరాబాద్‌లో వేళ్లూనిందని వార్తలొచ్చిన నేపథ్యంలో.. తన భర్త, తండ్రి, సోదరులను కిరాతకంగా చంపేసిన వారిపై ఓ మహిళ ప్రతీకారం తీర్చుకుంది

Advertiesment
ISIS
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (19:25 IST)
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐసిస్ హైదరాబాద్‌లో వేళ్లూనిందని వార్తలొచ్చిన నేపథ్యంలో.. తన భర్త, తండ్రి, సోదరులను కిరాతకంగా చంపేసిన వారిపై ఓ మహిళ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదుల తలల్ని తెగ్గోసి కూర వండేసింది. ఐసిస్‌తో యుద్ధం చేశానని, వారి తలలను తెగ్గోసి వండేశా.. వారి మిగిలిన శరీరభాగాలను కాల్చేశానని 39 ఏళ్ల ఇరాకీ మహిళ వాహిదా మొహ్మద్ అల్-జుమైలీ పేర్కొంది. గృహిణిగా ఉంటూనే తన కుటుంబాన్ని హతమార్చిన ఐసిస్ ఉగ్రమూకలపై ప్రతీకారం తీర్చుకున్నానని, 70 మందితో కలిసి షిర్కాత్ పట్టణంలో సొంత సైన్యాన్ని తయారుచేసుకుంది. 
 
2004 నుంచి ఉగ్రవాదులతో పోరాడుతూనే ఉంది. ఆమెకు ప్రభుత్వ దళాల నుంచి కూడా మద్దతు అందుతోంది. వాహిదాకు ఆయుధాలు, వాహనాలు సమకూర్చినట్టు సలాహుద్దీన్ ప్రావిన్స్‌లోని ఇరాకీ దళాల కమాండర్ జనరల్ జామా అనంద్ తెలిపారు.
 
ఇకపోతే... ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి తాను ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నానని వాహిదా పేర్కొంది. తీవ్రవాదుల నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని, ఉగ్రవాదులు ఆరుసార్లు తనను చంపేందుకు ప్రయత్నించారని వివరించింది. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తన పక్కటెముకల్ని కూడా విరగొట్టుకున్నానని ఆ మహిళ చెప్పింది. వారి వాంటెడ్ లిస్ట్‌లో ప్రధాని కంటే ముందు తనపేరే ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
ఐసిస్ ఉగ్రవాదుల తలలు తెగ్గోసి వండుతున్న ఫోటోలను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. రెండు తలలను వండుతున్న ఫొటోలు, మొండెం వద్ద నిల్చున్న ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ఏడాది మొదట్లో వాహిదా రెండో భర్తను చంపేశారు. అంతకుముందు ఆమె తండ్రి, ముగ్గురు సోదరులను హతమార్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగ్రవాదుల మృతదేహాలను పాకిస్థాన్ రహస్యంగా ఖననం చేసిందా? హై అలెర్ట్..