Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆహారం ఇచ్చేందుకు వెళ్తే.. మహిళా-జూకీపర్‌పై పెద్దపులి పంజా విసిరింది.. (ఫోటో)

రష్యాలోని ఓ జూలో పులికి ఆహారం ఇచ్చేందుకు వెళ్లిన ఓ మహిళపై సైబరియన్ పులి దాడి చేసింది. జూలో పనిచేసే మహిళా జూ-కీపర్ పులికి ఆహారం ఇవ్వజూపింది. అంతలోనే ఆకలి మీదున్న పెద్దపులి ఆమెపైనే పంజావిసిరింది. వివరాల

Advertiesment
ఆహారం ఇచ్చేందుకు వెళ్తే.. మహిళా-జూకీపర్‌పై పెద్దపులి పంజా విసిరింది.. (ఫోటో)
, సోమవారం, 6 నవంబరు 2017 (14:57 IST)
రష్యాలోని ఓ జూలో పులికి ఆహారం ఇచ్చేందుకు వెళ్లిన ఓ మహిళపై సైబరియన్ పులి దాడి చేసింది. జూలో పనిచేసే మహిళా జూ-కీపర్ పులికి ఆహారం ఇవ్వజూపింది. అంతలోనే ఆకలి మీదున్న పెద్దపులి ఆమెపైనే పంజావిసిరింది. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని కలిన్‌ఇన్‌గ్రాడో జూలో మహిళా జూ కీపర్.. సైబరియన్ పులికి ఆహారం ఇచ్చేందుకు వెళ్లగా.. ఉన్నట్టుండి ఆ పులి ఆమెపై పంజా విసిరి దాడి చేసింది. 
 
ఎవరూ లేని చోటికి లాక్కెళ్లింది. దీన్ని చూసిన పర్యాటకులు పులి బారి నుండి మహిళను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. చేతికందిన వస్తువులతో దానిపై దాడి చేశారు. దీంతో ఆ పులి మహిళను వదిలి దూరంగా పారిపోయింది. ఆపై జూ-కీపర్లు ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన మహిళా జూ-కీపర్ తీవ్ర గాయాల పాలైందని వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దటీజ్ మోడీ... కరుణతో భేటీ... తమిళనాట రాజుకున్న రాజకీయ సెగ