ఉక్రెయిన్‌పై రష్యా సైనిక బలగాలు, యుద్ధ ట్యాంకులు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఆ దేశ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అండర్ గ్రౌండ్లు, బంకర్లు, మెట్రో సొరంగాల్లో తలదాచుకుంటున్నారు. ఈ సమయంలో ఉద్వేగ భరిత ఘటన చోటుచేసుకుంది.
బాంబుల మోత, క్షిపణలు హోరు, వైమానిక దాడుల సైరన్ల మోత మధ్య ఓ గర్భిణీ మహిళ ప్రసవించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం రాత్రి అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో తలదాచుకున్న ఓ నిండుగర్భిణి ప్రసవ నొప్పులు వచ్చాయి.
దీన్ని గమనించిన వైద్య సిబ్బంది ఆమెకు సహకరించారు. ఆ గర్భిణీ మహిళను ఆస్పత్రికి తరలించడంతో ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అలా ఓ చిన్నారి యుద్ధభూమిలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.