Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దుబాయ్ రాకుమారిని కిడ్నాప్ చేసిన డి గ్యాంగ్... ఎలా?

భారత్‌లో దుబాయ్ రాకుమారిని మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ (డి గ్యాంగ్) కిడ్నాప్ చేసింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆమెను విడిపించేందుకు డి గ్యాంగ్‌కు చెందిన ప్రముఖ వ్యక్తిని రిలీజ్ చేసింద

Advertiesment
Dubai Princess
, శుక్రవారం, 30 మార్చి 2018 (11:25 IST)
భారత్‌లో దుబాయ్ రాకుమారిని మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ (డి గ్యాంగ్) కిడ్నాప్ చేసింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆమెను విడిపించేందుకు డి గ్యాంగ్‌కు చెందిన ప్రముఖ వ్యక్తిని రిలీజ్ చేసింది. ఈ వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
దుబాయ్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తెగా భావిస్తున్న రాకుమారి షికా లతీఫా ఇంట్లో చోటుచేసుకున్న మనస్పర్థల కారణంగా ఇంటినుంచి పారిపోయింది. ఆ తర్వాత ఆమె గోవాకు వచ్చి కిడ్నాప్‌కు గురైంది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలియడంతో గుట్టుచప్పుడు కాకుండా స్పందించింది. ఆమెను విడిపించి, ఇంటికి తిరిగి పంపింది. ఇందుకోసం డి గ్యాంగ్‌కు చెందిన ఓ కీలక వ్యక్తిని భారత ప్రభుత్వం విడిపించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ విషయాన్ని ఫ్రెంచ్ అమెరికన్, లతీఫాతో పాటు ఇండియాలో పర్యటించిన హార్వే జౌబర్ట్ స్వయంగా వెల్లడించారు. తామిద్దరినీ భారత అధికారులు విడిపించి అరబ్ ఎమిరేట్స్‌కు పంపించారని, ఆపై ఎన్నో రోజుల పాటు తనను నిర్బంధించి, విచారించిన తర్వాత తనను విడిచిపెట్టారని ఆయన అన్నారు.
 
కాగా, జౌబర్ట్ 62 ఏళ్ల ఓ ఫ్రెంచ్ గూఢచారి. గూఢచార కార్యకలాపాల్లో కఠోర శిక్షణ తీసుకుని ప్రస్తుతం దుబాయ్ రాజకుటుంబానికి సేవలందిస్తున్నాడు. లతీఫాను రాజకుటుంబం హింసిస్తుండటంతో, నాయకీయ పరిస్థితుల్లో ఆమె పారిపోయిందని, విషయం తెలుసుకున్న తాను కూడా ఆమె వెంట వచ్చానని ఓ వీడియో స్టేట్మెంట్‌లో జౌబర్ట్ వెల్లడించాడు. 
 
తామున్న చిన్న పడవను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది మార్చి 4వ తేదీన గుర్తించారని చెప్పిన ఆయన, ఆపై నాలుగు రోజుల తర్వాత భారత్ చేసిన పనికి ప్రతిఫలంగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సహచరుడు ఫరూక్ తక్లాను యూఏఈ నుంచి డిపోర్ట్ చేశారని తెలిపాడు. దుబాయ్‌లో జరిగిన ఈ ఘటనలపై భారత విదేశాంగ శాఖ ఇంతవరకూ స్పందించలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నారట...