Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం.. 12మంది దుర్మరణం

Advertiesment
మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం.. 12మంది దుర్మరణం
, గురువారం, 10 జూన్ 2021 (13:52 IST)
భారత సరిహద్దు దేశం మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలటరీ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. విమాన పైలట్‌తో పాటు మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మయన్మార్‌లో రెండో అతి పెద్ద నగరమైన మాండలేలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మయన్మార్ మిలటరీ విమానం రాజధాని నేపిడా నుంచి పియన్‌వూ ల్విన్‌కు బయలుదేరింది. ఈ క్రమంలోనే అదుపుతప్పి మాండలేలోని స్టీల్ ప్లాంట్‌ సమీపంలో కుప్పకూలింది. దాదాపు 984 ఫీట్ల ఎత్తు నుంచి కిందపడిపోయినట్లు మిలటరీ నేతృత్వంలోని మియవాడి టెలివిజన్ తెలిపింది. 
 
విమానంలో ఆరుగురు మిలటరీ సిబ్బందితో పాటు పలువురు సాధువులు ఉన్నారు. వారంతా ఓ బుద్దిస్ట్ మఠానికి వెళ్లాల్సి ఉందని అంతలోనే ఈ ఘోర జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఐతే విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగస్టు 31లోగా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే.. టెస్లా మోడల్ 3 కారు!