Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముచ్చటగా మూడోసారి తండ్రి కాబోతున్న మార్క్ జుకర్‌బర్గ్

Advertiesment
mark zuckerberg couple
, సోమవారం, 2 జనవరి 2023 (10:06 IST)
ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ముచ్చటగా మూడోసారి తండ్రికాబోతున్నాడు. మెటా సీఈవోగా ఉన్న ఈయన ఈ సంతోషకరమైన వార్తను తన ఇన్‌స్టాఖాతాలో వెల్లడించారు. ప్రేమకు ప్రతిరూపమైన మరో వ్యక్తి ఈ యేడాది తమ జీవితంలోకి రాబోతున్నట్టు పేర్కొన్నారు. 
 
భార్య ప్రిస్కిలా చాన్‌తో ఉన్న ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. ఈ ఫోటోలో ప్రిస్కిల్లా బేబీబంప్‌తో కనిపిస్తున్నారు. కాగా, మార్క్ జుకర్‌బర్గ్ దంపతులకు ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు ఉన్న విషయం తెల్సిందే. ప్రిస్కిల్లా, జుకర్‌బర్గ్‌లు కాలేజీ‌మేట్స్. 
 
హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకుంటున్నపుడు వీరు ప్రేమించుకుని 2003 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత 2012 మే 19వ తేదీన వివాహం చేసుకోగా, 2015లో మాక్సిమా చాన్ అనే అమ్మాయికి, ఆ తర్వాత 2017లో ఆగస్ట్ అనే పాపకు జన్మిచ్చారు. ఇపుడు మరో చిన్నారి తమ జీవితంలోకి రానున్నట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజస్థాన్ రాష్ట్రంలో పట్టాలు తప్పిన సూర్యనగరి ఎక్స్‌ప్రెస్..