Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మార్క్ జుకెర్‌బర్గ్ దాతృత్వం... రూ.3 బిలియన్ డాలర్ల విరాళం

ఫేస్‌బుక్ అధినేత జుకర్ బర్గ్ పేరు తెలియని వారుండరు. ఎందుకంటే ఫేస్‌బుక్‌తో ప్రపంచాన్ని అనుసంధానం చేసిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో వందల కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మ

మార్క్ జుకెర్‌బర్గ్ దాతృత్వం... రూ.3 బిలియన్ డాలర్ల విరాళం
, గురువారం, 22 సెప్టెంబరు 2016 (15:14 IST)
ఫేస్‌బుక్ అధినేత జుకర్ బర్గ్ పేరు తెలియని వారుండరు. ఎందుకంటే ఫేస్‌బుక్‌తో ప్రపంచాన్ని అనుసంధానం చేసిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో వందల కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తన చిరకాల స్నేహితురాలు ప్రిస్ సిల్లా చాన్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. అలాంటి ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ భార్య కన్నీటి పర్యంతరం అయ్యింది. శాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో లేడీ జుకర్ బర్గ్ చాన్ పిల్లల వ్యాధుల గురించి మాట్లాడుతూ కన్నీళ్లతో కదిలిపోయారు. 
 
క్యాన్సర్, గుండెజబ్బులు, అంటు వ్యాధుల బారిన పడ్డ చిన్నారులను చూసి వారి తల్లిదండ్రులు పడే నరకయాతనను ఎన్నో మార్లు ప్రత్యక్షంగా చూసిన ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ సతీమణి ప్రిస్కిల్లా చాన్, ఆ ఘటనలు గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. చిన్న పిల్లల్లో వ్యాధులు, నివారణకు  ఉద్దేశించిన ప్రణాళికకు గాను దాదాపు రూ.20,054 కోట్లు (3 బిలియన్ డాలర్లు) విరాళంగా ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 
 
అంతేకాదు 'బయోహబ్' అనే సంస్థ వ్యాధుల నివారణకు చేస్తున్న కృషిని అభినందిస్తూ, 600 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన 10 నుంచి 15 పరిశోధనా సంస్థలతో కలసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. చిన్నారుల జీవితకాలంలో వచ్చే వ్యాధులను నిర్మూలించేందుకు కృషి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. 
 
ఈ సందర్భంగా జుకర్‌ మాట్లాడుతూ మన చిన్నారులకు మంచి, ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఇద్దామని పిలుపునిచ్చారు. హెచ్ఐవీ, జికా, ఎబోలా వంటి ప్రాణాంతక వైరస్‌లను అడ్డుకునే ఔషధాలను తయారు చేసే కంపెనీలకు సాయం చేయడానికి తాము సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన బిల్ గేట్స్, ప్రిస్కిల్లా తీసుకున్న దాతృత్వ నిర్ణయాన్ని అభినందించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలయన్స్‌కు చుక్కలు చూపుతున్న టెలికాం కంపెనీలు.. జియో నుంచి ఫోన్ వచ్చిందా.. కాల్‌‌డ్రాప్...