Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెయింట్‌గా మరియం థ్రెసియా: ప్రకటించిన పోప్‌ ఫ్రాన్సిస్‌

Advertiesment
Mariam Thresia
, సోమవారం, 14 అక్టోబరు 2019 (07:33 IST)
వాటికన్‌ సిటీలో ఆదివారం జరి గిన కార్యక్రమంలో పోప్‌ ఫ్రాన్సిస్‌ భారత్‌ లోని కేరళకు చెందిన నన్‌ మరియం థ్రెసియాను సెయింట్‌గా ప్రకటించా రు.

ఈ కార్యక్రమానికి విదేశాంగ స హాయ మంత్రి మురళీధరన్‌ హాజర య్యారు. థ్రెసియా 1914మేలో త్రి స్సూర్‌లో పవిత్ర కుటుంబ సోదరీమ ణుల సమాజాన్ని స్థాపించారు. రోమ్‌ లోని సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో యూకా రిస్టిక్‌ వేడుకలో థ్రెసియాను కీర్తించారు.

ఇంగ్లీష్‌ కార్డినల్‌ జాన్‌ హెన్రీ న్యూమాన్‌, స్విస్‌ లేవుమన్‌ మార్గూరేట్‌ బేస్‌, బ్రెజిలియన్‌ సిస్టర్‌ డుల్స్‌లోప్‌ మరియు ఇటాలియన్‌ సిస్టర్‌ గియుసెప్పినా వన్నినీలతోపాటు మరియం థ్రెసియాను మహాత్ముల జాబితాలో చేర్చనున్నారు. శతాబ్దాల కాలంలో కేరళ నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగిన నాల్గవ వ్యక్తిగా ఆమెను పరిగణించ నున్నారు.

మదర్‌ మరియం థ్రెసియా కాననైజేషన్‌ వేడుకలను ఆదివారం త్రివేం డ్రంలోని సెయింట్‌ జోసఫ్‌ కెథడ్రిల్‌ చర్చిలో నిర్వహించారు. బాప్తిజం తీసుకున్న మే 3 1876 నుంచి 1904వరకు మరియం థ్రెసియా సగం జీవితకాలం వరకూ ఆమెను థెరిసాగానే పిలిచేవారు.

అనంతరం ఆమె మేరీ మాత ఆశీస్సులతో తన పేరు ముందు మరియం చేర్చవలసిందిగా కోరారు. ఏసును అనుకరిస్తూ ఆమె పేద లకు సహాయంచేసిందని, రోగులకు వైద్యం, పారిస్‌ను సందర్శించి ఒంటరి ప్రజ లను ఆమె ఓదార్చిందని వాటికన్‌ న్యూస్‌ తెలిపింది. చర్చి ఆమెను అరుదైన పవిత్ర వ్యక్తులుగా ప్రకటించింది.

జోస్యం, వైద్యం, కాంతి ప్రకాశం, సువాసన వంటి ఆధ్యాత్మిక బహుమతులు ఆమెకు లభించాయని వాటికన్‌ తెలిపింది. సిస్టర్‌ థ్రెసియా జూన్‌ 8, 1926న 50సంవత్సరాల వయసులో మరణించారు. పోప్‌ సెయింట్‌ జాన్‌పాల్‌ -2 ఏప్రిల్‌ 9, 2000న ఆమెను ఆశీర్వదించారు.

పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆమె మధ్యవర్తిత్వం ద్వారా జరిగిన అద్భుతాన్ని గుర్తించడంతో సెయింట్‌హుడ్‌కు మార్గం సుగమమైంది. అక్టోబర్‌ 13న కాననైజేషన్‌ రోజుగా నిర్ణయించారు. వాటి కన్‌ సిటీలో జరిగిన కార్యక్రమానికి భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్‌ నాయకత్వం వహించారు.

కాగా సెప్టెంబర్‌ 29న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మన్‌ కీ బాత్‌ రేడియో కార్యక్రమంలో మరియం థ్రెసి యా గురించి ప్రస్తావించారు. అక్టోబర్‌ 13న పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆమె సెయింట్‌గా ప్రక టించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. కాగా, మదర్‌ థెరిస్సా తర్వాత భారత్‌ నుంచి సెయింట్‌ హోదా పొందిన రెండవ భారతీయురాలిగా ఆమె గుర్తింపు పొందారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముగ్గురిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు... ఎందుకు?