Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డొనాల్ట్ ట్రంప్‌ను అంత తేలిగ్గా తీసిపారేయొద్దు.. ఆ విషయంలో దిట్ట.. ఎన్నారైలకు మేలే?

సంచలన వ్యాఖ్యలు.. దురుసుతనంతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీని వెనక్కి నెట్టి జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ గురించి నెగటివ్‌గా మీడియాలో ప్రచా

Advertiesment
Many Indian-Americans
, గురువారం, 10 నవంబరు 2016 (15:45 IST)
సంచలన వ్యాఖ్యలు.. దురుసుతనంతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీని వెనక్కి నెట్టి జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ గురించి నెగటివ్‌గా మీడియాలో ప్రచారం జరిగాయి. ఆయనపై విమర్శలూ వచ్చాయి. అయితే గెలుపు మాత్రం ఆయన్నే వరించింది.

ఇందుకు కారణం ఆయనలోని కొన్ని టెక్నిక్సే అంటున్నారు అమెరికా జనం. అంతేకాదు.. ట్రంప్‌ను అంత తేలిగ్గా తీసిపారేయలేమని.. ట్రంప్ అధ్యక్షుడైతే అమెరికాతో పాటు అమెరికాలోని భారతీయ అమెరికన్లకు ఎంతో మేలు చేకూరుతుందని రిపబ్లికన్ నేషనల్ కమిటీ జాతీయ సభ్యురాలు హర్మీత్ కౌర్ ధిల్లాన్ అంటున్నారు. 
 
ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా రికార్డు స్థాయిలో 75 మంది భారతీయ అమెరికన్లను తన పాలనా యంత్రాంగంలో నియమించారు. అయితే ఈ రికార్డును డొనాల్డ్ ట్రంప్ అధిగమిస్తారనే టాక్ వస్తోంది. ఫలితంగా డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగంలో ప్రముఖ భారతీయ అమెరికన్లు భాగస్వాములయ్యే  అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలను హర్మీత్ వ్యాఖ్యలు మరింత బలపరిచాయి. డొనాల్డ్ ట్రంప్ వ్యాపార దిగ్గజం కావడంతో ప్రతిభావంతులను ఎంపిక చేయడంలో నిపుణుడని ధిల్లాన్ చెప్తున్నారు. 
 
వచ్చే ఏడాది జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ అత్యుత్తమ ప్రతిభావంతులను నియమించుకోవడంలో దిట్ట అంటూ పేర్కొన్నారు. అమెరికా పాలనలో తనకు సహకరించేందుకు అత్యుత్తములను ఎంపిక చేసుకోవాలని ట్రంప్ కోరుకుంటున్నారని హర్మీత్ చెప్పారు. ప్రముఖ భారతీయ అమెరికన్లు ఈ జాబితాలో ఉండే అవకాశం ఉందని తెలిపారు. 
 
అంతేగాకుండా డొనాల్డ్ ట్రంప్ విజయంతో అమెరికన్లకు కొత్త అవకాశాల శకం ప్రారంభమైందని, దీనివల్ల భారతీయ అమెరికన్లకు కూడా ప్రయోజనం ఉంటుందని చెప్పారు. అమెరికా పరిపాలనలో భారతీయ అమెరికన్‌ను నియమించిన అమెరికా ప్రెసిడెంట్లలో రోనాల్డ్ రీగన్‌ మొదటివారని ధిల్లాన్ గుర్తుచేశారు. ట్రంప్ విజయంలో భారతీయ అమెరికన్ల మద్దతు కూడా ఉండదని హర్మీత్ కౌర్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రంప్ అమెరికా అధ్యక్షుడవుతాడని చెప్పిన చైనా కోతికి సన్మానం...