ట్రంప్ అమెరికా అధ్యక్షుడవుతాడని చెప్పిన చైనా కోతికి సన్మానం...
చైనా కోతి చెప్పిన జోస్యం నిజమైంది. గతంలో అక్టోపస్ పాల్ జోస్యం చెప్పినట్టుగానే ఈ కోతి కూడా జోస్యం చెప్పింది. అక్టోపస్ పాల్ 2010 ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో అంతిమ విజేత ఎవరో ముందుగానే జోస్యం చెప్పింది. అలాగే, చైనా కోతి కూడా ఇపుడు అమెరికా అధ్యక్షుడు ఎవరో జోస
చైనా కోతి చెప్పిన జోస్యం నిజమైంది. గతంలో అక్టోపస్ పాల్ జోస్యం చెప్పినట్టుగానే ఈ కోతి కూడా జోస్యం చెప్పింది. అక్టోపస్ పాల్ 2010 ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో అంతిమ విజేత ఎవరో ముందుగానే జోస్యం చెప్పింది. అలాగే, చైనా కోతి కూడా ఇపుడు అమెరికా అధ్యక్షుడు ఎవరో జోస్యం చెప్పింది. ఈ కోతి పేరు 'గెడా'.
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడిన రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ల కటౌట్లను గెడా ముందు ఉంచారు. ఇద్దరి కటౌట్లను కాసేపు చాలా తీక్షణంగా చూసిన గెడా... చివరకు ట్రంప్ కటౌట్‌ను కౌగిలించుకుని, ఆయనకు ముద్దు పెట్టింది. ఈ రకంగా, ట్రంపే అంతిమ విజేత అని తేల్చేసింది.
మరో విషయం ఏమిటంటే... ఈ యేడాది జరిగిన యూరోపియన్ సాకర్ ఛాంపియన్ షిప్‌లో కూడా విజేత ఎవరో గెడా ముందుగానే చెప్పింది. ఛాంపియన్‌గా పోర్చుగల్ గెలుస్తుందని గెడా చెప్పిన జోస్యం నిజమైంది. ఇప్పుడు ట్రంప్ విషయంలోనూ నిజమైంది. ఈ వార్త తెలుసుకున్న ట్రంప్ మద్దతుదారులు ఆ కోతికి సన్మానం చేయాలనుకుంటున్నారట.