Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుమార్తె తల తెగనరికిన తండ్రి.. శిక్ష ఏంటో తెలుసా?

కుమార్తె తల తెగనరికిన తండ్రి.. శిక్ష ఏంటో తెలుసా?
, ఆదివారం, 30 ఆగస్టు 2020 (15:18 IST)
సాధారణంగా అరబ్ దేశాల్లో నేరాలకు పాల్పడేవారికి విధించే శిక్షలు చాలా కఠినాతి కఠినంగావుంటాయి. అందుకే ముస్లిం దేశాల్లోని స్త్రీపురుషులు లేదా యువత తప్పులు చేయాలంటే భయపడిపోతారు. అయినప్పటికీ.. కొన్ని చోట్ల తప్పులు జరుగుతూనే వున్నాయి. 
 
తాజాగా తమ కుటుంబ పరువు తీయడాన్ని సహించలేని ఓ తండ్రి.. కన్నకుమార్తె తల తెగనరికేశాడు. ఇతనికి కేవలం తొమ్మిదేళ్లు మాత్రమే శిక్ష విధించారు. అంత పెద్ద నేరానికి పాల్పడిన తండ్రికి కేవలం 9 యేళ్లు మాత్రమే శిక్ష విధించడం పట్ల ఇరాన్ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పైగా, ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇరాన్ దేశంలో ఓ 14 యేళ్ళ యువతి 28యేళ్ల యువకుడితో పారిపోయింది. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన ఆ యువతి తండ్రి.. కన్నబిడ్డ అని కూడా చూడకుండా హత్య చేశాడు. 
 
అంత పెద్ద నేరం చేసిన వ్యక్తికి కేవలం 9 యేళ్లు మాత్రమే శిక్ష విధించడంతో ఇరాన్ ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు కుటుంబ పరువు తీసినందుకూ కూతరు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాలంటూ నిందితుడు తనకు చెప్పాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
 
కాగా.. ఈ ఘటన ప్రస్తుతం ఇరాన్‌లో కలకలానికి దారితీస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి పరువు హత్యలు తరచూ జరుగుతుంటాయని, దీన్ని ప్రభుత్వం కూడా అడ్డు కోవట్లేదని అక్కడి వారు ఆరోపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. కారణమేంటి?