తాగుడు పందేంలో గెలిచాడు.. కానీ ప్రాణాలు కోల్పోయాడు.. వీడియో చూడండి
డొమినిక్ దేశానికి చెందిన కెల్వియన్ రఫెల్ మెజియా అనే వ్యక్తి తాగుడు పందేంలో పాల్గొన్నాడు. అతనికి 23ఏళ్లు. మద్యం అంటే పడి చచ్చే.. ఈ వ్యక్తి నిజంగానే ఆ కాంటెస్టులో పాల్గొని ప్రాణాలు కోల్పోయాడు. రోజు తప్ప
డొమినిక్ దేశానికి చెందిన కెల్వియన్ రఫెల్ మెజియా అనే వ్యక్తి తాగుడు పందేంలో పాల్గొన్నాడు. అతనికి 23ఏళ్లు. మద్యం అంటే పడి చచ్చే.. ఈ వ్యక్తి నిజంగానే ఆ కాంటెస్టులో పాల్గొని ప్రాణాలు కోల్పోయాడు. రోజు తప్పతాగే ఇతడితో మందు తాగడంలో ఎవరూ పోటీపడలేరట. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం అతడు రోజూ మందు కొట్టే నైట్ క్లబ్‌కు వెళ్లాడు. అక్కడ మందు కొట్టే పోటీ జరుగుతోంది.
ఇందులో పాల్గొన్న మెజియా.. టక్కీలా అనే మద్యాన్ని.. శ్వాస తీసుకునే క్షణాల్లో ముగించి.. 520 డాలర్లు గెలిచాడు. అయితే కొద్ది క్షణాల్లో స్పృహ కోల్పోయి కిందపడ్డాడు. దీంతో అతడిని పరిశోధించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇక మెజియాకు రెండేళ్ల కుమార్తె ఉంది. ప్రస్తుతం మెజియా తప్ప తాగే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.