నా అమ్మ పేరు జయలలిత- నాన్న పేరు ఎంజీఆర్.. సీన్లోకి వచ్చిన ప్రియా మహాలక్ష్మీ
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం అన్నాడీఎంకే రాజకీయాలు దిగజారిపోయాయి. ఓపీఎస్, పళని స్వామి, శశికళ అంటూ మూడు వర్గాలుగా చీలిపోయాయి. జయ సోదరుడు కుమార్తె దీప, ఆయన కుమారుడు దీపక్ కూడా వేర్వేరుగా రా
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం అన్నాడీఎంకే రాజకీయాలు దిగజారిపోయాయి. ఓపీఎస్, పళని స్వామి, శశికళ అంటూ మూడు వర్గాలుగా చీలిపోయాయి. జయ సోదరుడు కుమార్తె దీప, ఆయన కుమారుడు దీపక్ కూడా వేర్వేరుగా రాజకీయాల్లో దిగారు. జయలలితకు వారసులు లేకపోవడంతో ఎవరుపడితే వారు తామే అమ్మకు వారసులమంటూ ముందుకు వస్తున్నారు. దీంతో తమిళ రాజకీయాలంటేనే ప్రజలు విసిగిపోయారు. తాజాగా తాను ఎంజీఆర్-జయలలితకు జన్మించిన పుత్రిక అంటూ ఓ మహిళ సీన్లోకి వచ్చింది.
సదరు మహిళల ట్విట్టర్ వీడియోలో తన పేరు ప్రియా మహాలక్ష్మీ అంటూ చెప్పారు. ఇన్నాళ్లు శశికళకు భయపడే తలమరుగైనానని చెప్పింది. ఆమె తనను చంపేస్తానని బెదిరించింది. ఇకపై భయపడకూడదంటూ.. ధైర్యం చేసుకుని బయటికి వచ్చానని వెల్లడించారు. అంతేగాకుండా తాను ఓ నకార్మీకుల సంఘానికి చెందిన పార్టీకి కోశాధికారిగా ఉన్నానని కూడా తెలిపారు. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ అవుతోంది.