Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్తుల్ని అమ్మేశాడు.. ఆ సొమ్ముతో పేదలకు అన్నం పెడుతున్నాడు బనానా కింగ్‌కు హ్యాట్సాఫ్!

ఆస్తుల్ని అమ్మేశాడు.. ఆ సొమ్ముతో పేదలకు రోజూ అన్నం పెడుతున్నాడు. ఆకలితో అలమటించే వారికి లేదనక అన్నం పెడుతున్నాడు. ఆయనో వ్యాపారి. అతనికి బనానా కింగ్ అనే పేరుంది. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో పుట్టిన బనాన

Advertiesment
ఆస్తుల్ని అమ్మేశాడు.. ఆ సొమ్ముతో పేదలకు అన్నం పెడుతున్నాడు బనానా కింగ్‌కు హ్యాట్సాఫ్!
, గురువారం, 30 జూన్ 2016 (12:38 IST)
ఆస్తుల్ని అమ్మేశాడు.. ఆ సొమ్ముతో పేదలకు రోజూ అన్నం పెడుతున్నాడు. ఆకలితో అలమటించే వారికి లేదనక అన్నం పెడుతున్నాడు. ఆయనో వ్యాపారి. అతనికి బనానా కింగ్ అనే పేరుంది. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో పుట్టిన బనానా కింగ్ అసలు పేరు అహుజా జగదీష్.

1947లో భారత్‌కు స్వతంత్ర్యం వచ్చాక బనానా కింగ్ కుటుంబం పాటియాలాకు వచ్చింది. అప్పుడు అహుజాకు 12 ఏళ్లు. చండీగడ్‌కు ఫ్యామిలీ షిప్ట్ అయ్యాక.. అక్కడే విద్యాభ్యాసాన్ని బనానా కింగ్ పూర్తి చేశాడు. అయితే అహుజా ఉద్యోగం చేయకుండా మార్కెట్లో పండ్లు, కూరగాయలను టోకున అమ్మే వర్తకుడిగా వ్యాపారం ప్రారంభించాడు. 
 
అనతి కాలంలోనే మంచి లాభాలు రావడంతో ఆయనకు సంపద కూడా బాగానే పెరిగింది. ఈ క్రమంలో అహుజాకు బనానా కింగ్ అనే పేరును కూడా స్థానిక వర్తకులు పెట్టేశారు. అయితే ఈ సంపదనంతా అహుజా పేదల కోసమే ఖర్చు చేసేవాడు. ఈ క్రమంలో గత 15 ఏళ్ల కిందట ఓ రోజు చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీఐఎంఈఆర్) వద్ద ఉన్న హాస్పిటల్ ఆవరణలో ఆకలితో అల్లాడిపోతున్న పేదలను అతను గమనించాడు. వారిని చూసిన అహుజా హృదయం చలించిపోయింది. అంతే ఇంటి వద్దే వంటలు చేయించి వాటిని కారులోకి ఎక్కించుకొని, పీజీఐఎంఈఆర్ హాస్పిటల్ వద్ద ఉన్న పేదలకు ఆహారాన్ని అందిస్తాడు. ఒక్కొక్కరికి మూడు చపాతీలు, ఆలూ చనా కూర, హల్వా, ఒక అరటి పండు, స్వీట్లు, బిస్కట్లు ఇవ్వడం ప్రారంభించాడు. 
 
వ్యాపారం ద్వారా వచ్చిన పలు ఖరీదైన భవనాలను కూడా అతను పేదల కోసం అమ్మేశాడు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతోనే పేదలకు ఆహాం పెడుతున్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్పిటల్ వద్దకు వచ్చే పేదలకు కూడా అహూజా ఉచితంగా భోజనమే కాకుండా అప్పడప్పుడు వారికి బ్లాంకెట్లు, స్వెటర్లు, దుస్తులను కూడా పంచేవాడు. ఇలా 15 సంవత్సరాల పాటు బనానా కింగ్ సేవ కొనసాగుతూనే ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై ఫేస్‌బుక్‌ వివరాలిస్తేనే వీసా... అమెరికా చర్యలు.. భారత్‌లో కూడానా?