Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

81 యేళ్ళ వృద్ధురాలిని పెళ్లాడిన 24 యేళ్ల యువకుడు... ఎందుకో తెలిస్తే షాక్?

81 యేళ్ళ వృద్ధురాలిని పెళ్లాడిన 24 యేళ్ల యువకుడు... ఎందుకో తెలిస్తే షాక్?
, ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (09:10 IST)
ఉక్రెయిన్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. 24 యేళ్ల యువకుడు ఒకరు 81 యేళ్ళ వృద్ధురాలిని పెళ్లి చేసుకున్నాడు. దీని వెనుక ఉన్న కారణం తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే. కేవలం సైనిక సేవలు అందించాల్సి వస్తుందన్న కారణంతో ఆ యువకుడు ఈ తరహా పని చేసినట్టు సైనికాధికారుల విచారణలో తేలింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉక్రెయిన్ దేశంలో నిర్బంధ సైనిక శిక్షణ అమల్లో వుంది. దీంతో యేడాదికోసారి సైనికాధికారులో జనావాసిత ప్రాంతాలకు వచ్చి యువకులను సైన్యంలోకి ఎంపిక చేస్తుంటారు. వీరికి శిక్షణ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
 
అయితే, అలెగ్జాండర్ కొండ్రాత్యుక్ అనే ఓ యువకుడు సైనిక సేవల నుంచి తప్పించుకునేందుకు 81 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడాడు. ఈ వ్యవహారం కాస్త అధికారులకు తెలియడంతో అతడిపై విచారణ చేపట్టారు. అయితే వరుడు మాత్రం తన బంధువైన ఆమెపై అత్యంత ప్రేమ ఉన్న కారణంగానే వివాహం చేసుకున్నానంటూ చెప్పుకొచ్చాడు. 
 
మిలిటరీ విధుల నుంచి తప్పించుకునే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పుకొచ్చాడు. మరోవైపు సదరు పెద్దావిడను కూడా మీడియా పలకరించడంతో ఆమె కూడా ఇదే తరహాలో స్పందించింది. అతడు మంచి భర్త అనీ... తనను బాగా చూసుకుంటాడని చెబుతూ మురిసిపోయింది. అయితే ఈ వ్యవహారంపై స్థానికుల స్పందన మాత్రం వేరేలా ఉంది.
 
'ఆ యువకుడు అసలు ఈ ప్రాంతంలోనే కనిపించడు. ఆమె ప్రస్తుతం ఒంటరిగా నివసిస్తోంది. అధికారులు సైన్యంలో యువకులను రిక్రూట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మాత్రమే ఆమెతే కనిపిస్తాడు. అది కూడా వివాహ సర్టిఫికెట్ చూపించి సైన్యంలో చేరికను తప్పించుకోవడానికే' అని పేర్కొన్నారు. 
 
మ్యారేజి సర్టిఫికెట్‌తో పాటు ఆమెకు ఇతరుల సాయం అవసరమంటూ వికలాంగ సర్టిఫికేట్ కూడా చూపిస్తాడు. అతడు ఇలా ఆధారాలుగా చూపించిన ప్రతిసారీ సైన్యంలో చేరకుండా తప్పించుకుంటున్నాడని వెల్లడించారు. ఉక్రెయిన్‌లో నిర్బంధ సైనిక శిక్షణ అమల్లో ఉండగా.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం మినహాయింపుల ఉంటుంది. అలెగ్జాండర్ ప్రస్తుతం సరిగ్గా ఇదే అవకాశాన్ని వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యడ్డీకి బళ్లారి విభజన చిచ్చు... ఎమ్మెల్యేల హెచ్చరిక!