Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా బాటలో కువైట్.. పాకిస్థాన్ సహా ఐదు ముస్లిం దేశాలపై నిషేధం

అమెరికా బాటలో కువైట్ నడవనుంది. పాకిస్థాన్ సహా ఐదు ముస్లిం మెజారిటీ దేశాలపై కువైట్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సిరియా, ఇరాక్, ఇరాన్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశీయులకు వీసాలు జారీ చేయడాన్ని నిషేధిస్త

Advertiesment
Kuwait Visa Ban
, శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (08:32 IST)
అమెరికా బాటలో కువైట్ నడవనుంది. పాకిస్థాన్ సహా ఐదు ముస్లిం మెజారిటీ దేశాలపై కువైట్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సిరియా, ఇరాక్, ఇరాన్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశీయులకు వీసాలు జారీ చేయడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఐదు దేశాల వలసదారులు, శరణార్థులు తమ దేశం వీసాకు దరఖాస్తు చేసుకోవద్దని సూచించింది. 
 
అతివాద ఇస్లామిక్ ఉగ్రవాదులు వలస వస్తారనే కారణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు కువైట్ ప్రభుత్వం పేర్కొంది. కాగా, ఏడు ముస్లిం దేశాలపై అమెరికా ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధిస్తూ ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. అయితే, సిరియా దేశంపై అమెరికా కంటే ముందుగానే కువైట్ నిషేధం విధించింది. 2011లోనే సిరియా దేశస్తులకు వీసాలు మంజూరు చేయడాన్ని కువైట్ నిలిపివేసిన సంగతి విదితమే. 
 
ఇదిలావుండగా, ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికాలోకి ప్రవేశించకుండా అరికట్టేందుకు ఏడు ముస్లిం దేశాలపై నిషేధం.. అమెరికన్ ఉద్యోగాలు అమెరిక్లకేనంటూ హెచ్-1బీ వీసాలపై కొరడా ఆ దేశ ఆర్థికవ్యవస్థకు ప్రతికూలంగా మారబోతున్నాయట. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో మళ్లీ అమెరికా ఎకానమీ కుదేలయ్యే స్థాయికి వెళ్లిపోతుందని ఆర్థికవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించడం, ఏడు దేశాలపై నిషేధం విధించడం అమెరికాను సందర్శించే ఇతర దేశాల పర్యాటకులపైన, విద్యార్థులపైన ప్రభావం చూపనుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ ఆదేశాలు కేవలం ఏడు దేశాలకే పరిమితం కావంటున్నారు. వస్తువులు, సర్వీసుల రూపంలో జరిగే గ్లోబల్ ఎక్స్చేంజ్ పాజిటివ్ అంశాలకు ట్రంప్ దెబ్బతీస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అమెరికా ఎకానమీకి విదేశీ పర్యాటకులే ఎంతో కీలకమైన మద్దతు అందిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిషేధాలు, నిరసనలూ సరే.. ఆ ఏడు దేశాల పిల్లల గతేమిటి: ప్రియాంక చోప్రా ప్రశ్న