Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిషేధాలు, నిరసనలూ సరే.. ఆ ఏడు దేశాల పిల్లల గతేమిటి: ప్రియాంక చోప్రా ప్రశ్న

అమెరికాలోకి ఏడు ముస్లిం దేశాల ప్రజల ప్రవేశంపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ పౌరురాలిగా తనను తీవ్రంగా గాయపర్చిందని బాలివుడ్ హిరోయిన్ ప్రియాంకా చోప్రా తెలిపింది. ట్రంప్ చర్యకు వ్యతిరేకంగా మాట్లాడిన త

నిషేధాలు, నిరసనలూ సరే.. ఆ ఏడు దేశాల పిల్లల గతేమిటి: ప్రియాంక చోప్రా ప్రశ్న
హైదరాబాద్ , శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (06:59 IST)
అమెరికాలోకి ఏడు ముస్లిం దేశాల ప్రజల ప్రవేశంపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ పౌరురాలిగా తనను తీవ్రంగా గాయపర్చిందని బాలివుడ్ హిరోయిన్ ప్రియాంకా చోప్రా తెలిపింది. ట్రంప్ చర్యకు వ్యతిరేకంగా మాట్లాడిన తాజా సెలెబ్రటీల లిస్టులో ప్రియాంక కూడా చేరిపోయారు.
అమెరికన్ టీవీ చానెల్ ఏబీసీలో క్వాంటికో సీరియల్ ద్వారా హాలీవుడ్‌లోనూ పేరొందిన తార ప్రియాంక ట్రంప్ చర్యతో ప్రభావితమవుతున్న దేశాల పిల్లల పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది.  
 
ట్రంప్ నిషేధించిన దేశాలన్నింటిలో ఐక్యరాజ్యసమితికి చెందిన యునిసెప్‌కు సంబంధించిన పనులు అనేకం జరుగుతున్నాయని, ఇప్పుడీ నిషేధం వల్ల పిల్లలు బాగా ఇబ్బందులకు గురవుతున్నారని ప్రియాంక చెప్పింది. మాజీ మిస్ వరల్డ్ అయిన ప్రియాంక యునిసెఫ్ తరపున గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. 
 
ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, ఎమెన్ దేశాల ప్రజలను అమెరికాలోకి అడుగు పెట్టకుండా ట్రంప్ తీసుకొచ్చిన తాత్కాలిక నిషేధ ఉత్తర్వులకు వ్యతిరేకంగా అమెరికాలో, ప్రపంచ దేశాల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం, నిస్పృహ, నిస్సాహాయత, ప్రదర్శనలు, నిరసనలు వంటివన్నీ సమర్థించదగినవే అని ప్రియాంక చెప్పారు. 
 
ఈ నిషేధంపై ఇతరులు కూడా మాట్లాడాలని ఈ సందర్భంగా ప్రియాంక పిలుపిచ్చింది. తమ మతం కారణంగా మన పిల్లలు వివక్షకు గురికాకుండా ప్రపంచమంతా వినిపించేలా మనం కలిసి గొంతెత్తుదాం రండి. రాజకీయ విచ్చుకత్తుల వేట దుష్ఫలితాలను మనం భరించనవసరం లేదు అని ప్రియాంక పిలుపునిచ్చారు.
 
ట్రంప్ నిషేధపు ఉత్తర్వుకు వ్యతిరేకంగా గళమెత్తిన జెన్నిఫర్ లోపెజ్, జెన్నిఫర్ లారెన్స్, బార్బరా స్ట్రెయిశాండ్, రిహన్నా,  అష్టోన్ కుచ్చెర్ వంటి హాలీవుడ్ సెలెబ్రిటీలతో ప్రియాంక కూడా ఇప్పుడు చేతులు కలిపారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగ్రవాదులు కాదు.. అమెరికన్ ఉన్మాదులే రియల్ డేంజర్.. షాక్ కలిగిస్తున్న అసలు లెక్కలు