Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తరగదిలోనే విద్యార్థిపై టీచర్ అత్యాచారం.. బాలుడికి నష్టపరిహారంగా ఒక మిలియన్ డాలర్లు

బాలబాలికలపై లైంగిక వేధింపులు అధికమవుతున్నాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఇతే తంతు కొనసాగుతోంది. అమెరికాలో 15 ఏళ్ల బాలుడిపై ఓ 31 ఏళ్ల ఉపాధ్యాయురాలు క్లాస్ రూమ్‌లో అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటుచేసు

తరగదిలోనే విద్యార్థిపై టీచర్ అత్యాచారం.. బాలుడికి నష్టపరిహారంగా ఒక మిలియన్ డాలర్లు
, బుధవారం, 16 ఆగస్టు 2017 (13:25 IST)
బాలబాలికలపై లైంగిక వేధింపులు అధికమవుతున్నాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఇతే తంతు కొనసాగుతోంది. అమెరికాలో 15 ఏళ్ల బాలుడిపై ఓ 31 ఏళ్ల ఉపాధ్యాయురాలు క్లాస్ రూమ్‌లో అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన 2015వ సంవత్సరం జరిగినా.. బాలుడి తల్లిదండ్రులు నష్టపరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు. 
 
వివరాల్లోకి వెళితే.. జెనిఫర్ అనే 31 ఏళ్ల మహిళ అమెరికాలోని ఒక్లహొమా ప్రావిన్స్‌లోని హోలిస్ నగర పాఠశాల ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వర్తించింది. అదే పాఠశాలలో చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థిపై జెనీఫర్ 2015వ ఏడాది తరగతి గదిలోనే ఉంచి అత్యాచారానికి పాల్పడింది. ఈ కేసులో జెనీఫర్ 15 ఏళ్ల జైలు శిక్షకు గురైంది. ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్న జెనీఫర్‌పై బాధిత బాలుడి తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు.
 
ఆ పిటీషన్‌లో బాలుడి తల్లిదండ్రులు జెనీఫర్ పాల్పడిన అకృత్యానికి తమ పుత్రుడు అవమానకర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడని తెలిపారు. స్కూలులో సహవిద్యార్థులు అతనిని అవమానపరుస్తున్నారనే కారణంతో.. వేరొక పాఠశాలలో చేర్చామన్నారు. ఇలాంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటున్న తమ పుత్రుడి కోసం నిందితురాలి నుంచి నష్టపరిహారం కోరుతున్నట్లు తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు తల్లిదండ్రుల బాధలో వాస్తవం ఉండటంతో నష్టపరిహారంగా ఆ బాలుడికి ఒక మిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందిగా  పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరుణ ఆరోగ్యం... కలవరపడుతున్న తమిళజనం...